Bitcoin value: స్టాక్‌మార్కెట్ అనేది ఓ లోతైన అంశం. మహా సముద్రం అనుకోవచ్చు. అర్ధం చేసుకుంటే లాభాలు అనేకం. లేకపోతే నిలువునా కూరుకుపోతాం. బిట్‌కాయిన్ ఇప్పుడంతా ఇదే నయా ట్రెండ్. కేవలం 6 లక్షల పెట్టుబడితో..9 ఏళ్లలో ఎంత ఆర్జించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.
సెన్సెక్స్(Sensex), నిఫ్టీ, స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇదంతా నిన్నటి వరకూ ఉన్నమాట. సామాన్యులకు అర్ధం కాని సబ్జెక్ట్. అర్దం చేసుకుంటే మాత్రం అద్భుత లాభాలు ఆర్జించవచ్చు. లేకపోతే అలాగే నష్టపోతాం. ప్రావీణ్యముంటే రాత్రికి రాత్రి కుబేరుడు కావచ్చు లేదా నాశనం కావచ్చు. కంపెనీ షేర్ల విలువను సరిగ్గా అంచనా వేయగలిగినవాడే ఇందులో రాజు. ఏ కంపెనీ షేర్ ఎప్పుడు కొనుగోలు చేయాలి..ఎప్పుడు అమ్మేయాలనే క్యాలిక్యులేషన్స్‌పై ఆధారపడి ఉంటుంది అంతా. షేర్లు కొని అప్పటికప్పుడు కొద్దిగా లాభంతో అమ్మేసేది ఓ రకం. ఎక్కువ కాలం వేచి చూసేది మరో రకం. ఇప్పుడంతా క్రిప్టోకరెన్సీ(Cryptocurrency)శకం నడుస్తోంది.
భారీగా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారు. 2009లో ప్రారంభమైన క్రిప్టోకరెన్సీ గణనీయంగా ఎదిగింది. ఇందులో ప్రధానమైంది బిట్‌కాయిన్. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే 2012లో దాదాపు 616 బిట్‌కాయిన్ టోకెన్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో బిట్‌కాయిన్ ధర 978 రూపాయులుండేది. మొత్తం 616 బిట్ కాయిన్లను(Bitcoin)6 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆ తరువాత సుదీర్ఘకాలం పాటు బిట్‌కాయిన్ వ్యాలెట్ చూసుకోలేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆ సంగతే మర్చిపోయాడు. ఇటీవలి కాలంలో బిట్‌కాయిన్ గణనీయంగా వృద్ది సాధించింది. ఈ వ్యక్తి పెట్టిన 6 లక్షల పెట్టుబడి కాస్తా..ఇప్పుడు 216 కోట్లైంది. ఆశ్చర్యంగా ఉందా..అవును నిజమే. బిట్‌కాయిన్ వ్యాలెట్‌ను మరో వ్యాలెట్‌లో మార్చేటప్పుడు జరిగిన లావాదేవీల్ని బ్లాక్‌చైన్.కామ్ నిర్ధారించింది. ఇలాంటిదే సంఘటన జూలైలో జరిగింది. ఇప్పుడీ వ్యవహారంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది.
Also read: Adani in Media: అదానీ గ్రూప్ ఆ మీడియా సంస్థను కొనుగోలు చేయడం లేదట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook