Hyundai Creta Price and Features: SUV క్రెటా అమ్మకాలు భారీగా ఉన్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) వెల్లడించింది. ఎస్‌యూవీ క్రెటా ప్రారంభించిన 3 నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 26న క్రెటాను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు ఉండగా.. టాప్ మోడల్ ధర రూ.20.15 లక్షల వరకు ఉంది. ఇందులో కొన్ని వేరియంట్ల ధరలను రీసెంట్‌గా పెంచారు. పెట్రోల్ వేరియంట్ రేటు రూ.3,500 పెంచగా.. డీజిల్ వేరియంట్ ధర రూ.10,500 వరకు పెంచారు.
Also Read: EPFO Latest Update: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వేతన పరిమితి భారీగా పెంపు..!
ప్రస్తుతం మన దేశంలో హ్యుందాయ్‌లో క్రెటా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో నెలల 15,276 యూనిట్లు విక్రయించగా.. మార్చిలో 16,458 యూనిట్లు విక్రయించింది. అంతేకాకుండా ఈ కారు మార్చి 2024లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది. సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ కారు మొత్తం బుక్సింగ్స్‌లో 71 శాతం సన్‌రూఫ్ మోడళ్ల కార్లే ఉండడం విశేషం.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన కొత్త హ్యుందాయ్ క్రెటాకు వినియోగదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించిందని తెలిపారు. కేవలం 3 నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. మొత్తం బుకింగ్స్‌లో 71 శాతం సన్‌రూఫ్ మోడల్, 52 శాతం బుకింగ్‌లు కనెక్ట్ చేసిన కార్ వేరియంట్‌ల కోసం వచ్చాయన్నారు. భారత్‌లో కస్టమర్ల మారుతున్న అవసరాలను తెలియజేస్తోందన్నారు.
హ్యుందాయ్ కొత్త క్రెటా వారి గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ 'సెన్సుయస్ స్పోర్టినెస్' ఆధారంగా డిజైన్ చేశారు. ఇది లెవెల్ 2 ADAS సెక్యూరిటీ వ్యవస్థతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ కారులో కొత్త 1.5 లీటర్ టర్బో జీడీఐ ఇంజన్ కూడా అమర్చారు. ఇది కాకుండా డీజిల్‌తో సహా మరో రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు (ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒక్కొక్కటి 10.25-అంగుళాలు), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా ఉంటుంది. ఈ కారు మార్కెట్‌లో కియా సెల్టోస్, టాటా హారియర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు పోటీగా అమ్మకాలు జరుపుతోంది.
Also Read: Tatikonda Rajaiah: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Best Selling Car: మన దేశంలో అమ్మకాల్లో దుమ్ములేపిన కారు ఇదే.. రికార్డుస్థాయిలో బుకింగ్స్