Bank Holidays in June 2024: జూన్ నెలలో సెలవులు ఎక్కువగా రానున్నాయి. మే నెలలో సెలవులు కూడా ఎక్కువగానే వచ్చాయి. అయితే, ఈ సెలవులు ఆ ప్రాంతాలవారీగా ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఇది వివిధ రకాల పండుగాలు, వారంతం నేపథ్యంలో ఈ సెలవులు రానున్నాయి. ఈ నెలలో 5 రోజులు ఆదివారాలు ఉంటాయి. బ్యాంకుల్లో పని ఉన్న వినియోగదారులు ఈ సెలవుల జాబితా ఆధారంగా బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వార్యంలో ఈ సెలవులు వర్తిస్తాయి.
జూన్ నెలలో రానున్న బ్యాంకు సెలవుల జాబితా..
జూన్ 9 మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హరియాణ, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బ్యాంకులకు సెలవులు.
జూన్ 10 గురు అర్జున్ దేవ్ సంస్మారనార్థం పంజాబ్ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు
జూన్ 14 న పహిలి రాజ సందర్భంగా ఒడిశా వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
జూన్ 15న ఈశాన్య రాష్ట్రమైన మిజోరం వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఆరోజు వైఎంఏ డే, ఈరోజు ఒడిశాలో కూడా బ్యాంకులకు సెలవులు ఆరోజు వీరికి రాజసంక్రాంతి.
జూన్ 17న బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు.
జూన్ 21 వట సావిత్ర వ్రతం సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఇదీ చదవండి: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటి
వీక్ ఎండ్ బ్యాంక్ హాలిడే జాబితా..
జూన్ 8 రెండో శనివారం రానుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు
జూన్ 22 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఇక 2, 9, 16, 23, 30 ఈ రోజులు ఆదివారాలు ఈరోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు.
ఇదీ చదవండి: జూన్ నెలలో 10 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడు, ఎక్కడ
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు..
ఈ సెలవులు దృష్టిలో ఉంచుకుని బ్యాంకుల్లో ముందుగానే పనులు చూసుకోవాలి. బ్యాంకు వెబ్‌సైట్, మొబైల్ యాప్స్, ఏటీఎంలో ఏవైనా లావదేవీలు ఉంటే చూసుకోవాలి. మీకు బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందుగానే చూసుకొని దాని అనుసరించి మీ పనులు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పనులకు నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సెలవుల జాబితా కూడా ఆయా రాష్ట్ర పడుగలను అనుసరించి సెలవులు ఉంటాయి. ఆ ప్రాంతాలను బట్టి పండుగలు మారతాయి. సెలవుల కూడా మారతాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook