CNG Bike in India: దేశవ్యాప్తంగా సీఎన్జీ వాహనాల వినియోగం పెరిగింది. చాలా మంది వీటివైపే మెుగ్గు చూపుతున్నారు. ప్రజల అభిరుచి మేరకే ఆటో కంపెనీలన్నీ సీఎన్‌జీ అమర్చిన వాహనాలను తీసుకొస్తున్నాయి. దీని వల్ల పెట్రోల్ మరియు డీజిల్‌పై ఖర్చు చేసే ప్రజల డబ్బు ఆదా అవుతుంది మరియు కాలుష్యం కూడా తగ్గుతుంది. బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీతో నడిచే మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
ఈ బైక్ 2025లో తీసుకురావాలని అనుకున్నప్పటికీ.. దాని కంటే ముందే మార్కెట్లో విడుదల చేయాలని అనుకుంటోంది బజాజ్ ఆటో. ఈ బైక్ ను ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు మరియు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా తాము ఈ సీఎన్‌జీతో నడిచే బైక్‌లను తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పెట్రోల్ ధర సగానికి తగ్గుతుంది..
హీరో హోండా మాదిరిగానే ఈ బైక్ కూడా మార్కెట్లో పెను మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని బజాజ్ చెబుతోంది. దీంతో పెట్రోల్ ధర 50-65% తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. సిఎన్‌జి బైక్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 50%, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను 75% మరియు హైడ్రోకార్బన్ ఉద్గారాలను 90% తగ్గిస్తుంది.
ఈ బైక్ ఎలా ఉంటుందనేది కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు తెలిపింది. బైక్ ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉంటుందో కూడా చెప్పలేదు. అయితే ఈ కంపెనీ ప్యూచర్ లో మరిన్ని సీఎన్జీ బైక్‌లను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే లీకైన సమాచారం ప్రకారం, ఈ సిఎన్‌జి బైక్‌లు 100 సిసి నుండి 160 సిసి కెపాసిటీని కలిగి ఉండే అవకాశం ఉంది.
Also Read: IBA Hike: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్.. భారీ మొత్తంలో పెరగనున్న జీతాలు.. శనివారం కూడా సెలవు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook