Alliance Air-AIAHL for Sale Now: ఎయిర్ ఇండియా అమ్మకం పూర్తయింది. ఇప్పుడా సంస్థకు చెందిన అనుబంధ సంస్థల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కానుంది. అలయన్స్ ఎయిర్ సహా నాలుగు అనుబంధ సంస్థలు అమ్మకానికొచ్చాయి.
ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా(Air India)అమ్మకం ప్రక్రియను దిగ్విజయంగా ముగించిన తరువాత ఇప్పుడా సంస్థకు చెందిన అనుబంధ సంస్థల్ని అమ్మే ప్రక్రియ మొదలు కానుంది.ఈ నెల 8న ఎయిరిండియాను 18 వేల కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. టాటా గ్రూప్ నగదు రూపేణా 2 వేల7 వందల కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా 15 వేల 3 వందల కోట్ల రుణభారాన్ని స్వీకరించనుంది. ఈ డీల్ డిసెంబర్ నాటికి పూర్తికావచ్చని అంచనా. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తోపాటు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంస్థ AIATSLసైతం టాటా గ్రూప్ గూటికి చేరనున్నాయి.
ఇప్పుడు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలైన అలయన్స్ ఎయిర్(Alliance Air)సహా నాలుగు సంస్థల్ని అమ్మనున్నారు.14 వేల 7 వందల కోట్ల విలువైన భవనాలు, భూమి తదితర ఆస్థుల్ని దీనికోసం వినియోగించనున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ నాలుగు సంస్థలు ఏఐఏహెచ్ఎల్ కంపెనీ పేరుతో ఉన్నాయి. అలయన్స్ ఎయిర్‌కు ఉన్న 19 ఏటీఆర్ విమానాలు 48 ప్రాంతాలకు కనెక్ట్ అయున్నాయి. 2020లో 65.09 కోట్ల లాభాన్ని ఆర్జించగా ప్రస్తుతం 201 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఎయిర్ ఇండియా మొత్తం అప్పు 61 వేల 562 కోట్లు కాగా..15 వేల 3 వందల కోట్ల రుణాన్ని టాటా గ్రూప్(Tata Group) ఎయిర్ ఇండియా కొనుగోలులో భాగంగా స్వీకరించింది. మిగిలిన 46 వేల 262 కోట్ల రుణాన్ని అనుబంధ సంస్థల కంపెనీ AIAHLకు బదిలీ కానుంది. అంటే AIAHL(AIAHL) కొనుగోలుదారుడు ఈ రుణ భారాన్ని భరించాల్సి వస్తుంది.
Also read: Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook