AC, Fridges Offers: సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు!!

Amazon Summer Appliances Fest: బ్లూ స్టార్, క్యారియర్, క్రాంప్టన్, హావెల్స్ కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 'సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌' పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 08:47 PM IST
  • వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని
  • సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్
  • అమెజాన్ ఆఫర్లు పొతే మళ్లీ రావు
AC, Fridges Offers: సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు!!

Amazon Summer Appliances Fest: మొన్నటివరకు గజగజ వణికించిన చలి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మార్చి నుంచి వేసవి కాలం ఆరంభం కానుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్' వినియోగదారుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించింది. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫాన్స్ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా రాయితీలు ప్రకటించింది. ఎంతలా అంటే.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు అనేంతలా. కొన్నింటిపై ఏకంగా 40% వరకు తగ్గింపు ఆఫర్ ఉంది. 

బ్లూ స్టార్, క్యారియర్, క్రాంప్టన్, హావెల్స్, సింఫనీ, హిటాచీ, ఎల్జీ, హైయర్, శాంసంగ్, అమెజాన్ కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 'సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌' పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది. ఈ ఆఫర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలు, కూలర్‌లు మరియు మరిన్నింటిపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లలో HDFC బ్యాంక్ కస్టమర్‌లకు కార్డ్ మరియు EMI కొనుగోళ్లపై రూ. 1,500 వరకు తగ్గింపు ఉంది. యెస్ బ్యాంక్ మరియు సిటీ బ్యాంక్ కస్టమర్లు కూడా EMIలపై రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.

25% తగ్గింపు తర్వాత బ్లూ స్టార్ 0.8 టన్నుల 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ. 27,990 లకు లభిస్తుంది. సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ, స్లీప్ మోడ్ మరియు ఎకో మోడ్ వంటి కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టర్బో కూల్ సాంకేతికతను కలిగి ఉంది. క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ విండో ఏసీ రూ. 30,900 లకు లభిస్తుంది. ఇందులో ఆటో ఫ్యాన్ స్పీడ్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఎనర్జీ సేవర్ మోడ్, డ్రై మోడ్ మరియు టర్బో మోడ్ వంటి విభిన్న అప్షన్స్ ఉన్నాయి. 

క్రాంప్టన్ గ్రీవ్స్ సైలెంట్ ప్రో ఎన్సో స్మార్ట్ 1225 mm సీలింగ్ ఫ్యాన్ రూ. 8,399 లభిస్తుంది. ఇందులో ఏరోడైనమిక్ డిజైన్‌ ఉంది. స్విచ్ ఆఫ్ చేసే ముందు ఫ్యాన్ వేగం ఎంత ఉంటుందో.. ఆన్ చేసినప్పుడు కూడా అదే స్పీడ్ లో రన్ అవుతుంది. హావెల్స్ స్టీల్త్ ఎయిర్ సీలింగ్ ఫ్యాన్: రూ. 6,399 వద్ద లభిస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగం కోసం ECO BLDC టెక్నాలజీ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ కూడా ఉంది. 

సింఫనీ డైట్ 3D 55i+ పోర్టబుల్ టవర్ ఎయిర్ కూలర్ రూ. 10690లకు, హిటాచీ1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ. 40700లకు, ఎల్జీ 1.5 టన్ 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ. 39990లకు, హైయర్ 258 L 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 24690లకు, శాంసంగ్ 580 ఫ్రాస్ట్ ఫ్రీ ఇన్వర్టర్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్: రూ. 70990లకు, అమెజాన్ బేసిక్ 564 L సైడ్-బై-సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 46990లకు అందుబాటులో ఉన్నాయి. 

Also Read: Rohit Sharma Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. వైస్ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

Also Read: IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌.. నలుగురు సీనియర్ ఆటగాళ్లకు దక్కని చోటు! ఇక అంతే సంగతులా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News