Mobile Savings Days: స్మార్ట్​ఫోన్లపై అమెజాన్ సమ్మర్​ కూల్ ఆఫర్లు- పూర్తి వివరాలివే..

Mobile Savings Days: స్మార్ట్​ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చింది అమెజాన్​. మొబైల్ సేవింగ్స్​ డేస్ పేరుతో ఈ నెల 5 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ సేల్​ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 04:53 PM IST
  • స్మార్ట్​ఫన్లపై అమెజాన్ క్రేజీ డీల్స్​
  • మొబైల్ సేవింగ్స్​ డేస్ పేరుతో ఆఫర్లు
  • పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు
Mobile Savings Days: స్మార్ట్​ఫోన్లపై అమెజాన్ సమ్మర్​ కూల్ ఆఫర్లు- పూర్తి వివరాలివే..

Mobile Savings Days: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ స్మార్ట్​ఫోన్లు కొనేవారికి గుడ్​ న్యూస్ చెప్పింది. మొబైల్ సేవింగ్స్​ డేస్​ పేరుతో ఈ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్​. బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ల నుంచి ప్రీమియం మొబైల్​ ఫోన్ల వరకు స్పెషల్​ డిస్కౌంట్లను అందిస్తోంది.

వన్​ప్లస్​, శాంసంగ్​, ఐకూ, రియల్​మీ, ఒప్పో, రెడ్​మీ సహా ఇతర అన్ని బ్రాండెడ్​ మొబైల్ ఫోన్లపైనా ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్​ 5న ప్రారంభమైన ఈ ఆఫర్లు 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్​సెట్స్​, ఇయర్ బడ్స్​పైనా ఈ ఈ  డిస్కౌంట్లు అందుబగాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

డిస్కౌంట్లు ఇలా..

అన్ని రకాల మొబైల్​ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది అమెజాన్. దీనితో పాటు.. నో కాస్ట్​ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. వీటన్నింటితో పాటు బ్యాంక్ ఆఫర్​ బరోడా, సిటీ గబ్యాంక్ క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది అమెజాన్.

ఏ మొబైల్​పై ఎంత తగ్గింపు?

వన్​ ప్లస్​ నార్డ్​ సీఈ2 5జీ మొబైల్ ధరను రూ.25 వేల దిగువకు తగ్గించింది అమెజాన్​.

శాంసంగ్​ గెలాక్సీ ఎం32 మొబైల్​పై 24 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనితో ఈ మొబైల్​ను రూ.12,999కే సొంతం చేసుకునే వీలుంది. దీని అసలు ధర రూ.16,999గా ఉంది.

గేమింగ్ స్మార్ట్​ఫోన్​ ఐకూ 9 ఎస్​ఈ ప్రారంభ ధరను రూ.30,990కు తగ్గించింది అమెజాన్​.

రియల్​మీ నార్జో 50 ప్రారంభ ధరను రూ.11,749కు తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది.

రియల్​మీ నార్జో (4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​) ధరను రూ.12,999 నుంచి రూ.11,499కు తగ్గించింది. దీనిపై రూ.10,850 వరకు ఎక్స్​ఛేంజ్ ఆఫర్​ అందుబాటులో ఉంది.

రెడ్​మీ నోట్​ 10 ఎస్​ (6జీబీ ర్యామ్​+ 64 జీబీ స్టోరేజ్​) మోడల్​పై రూ.2 వేలక వరకు డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. అంటే రూ.16,999 విలువైన ఈ స్మార్ట్​ఫోన్​ను రూ.14,999కే కొనుగోలు చేసే అవకాశముంది.

Also read: Stock Markets: మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు- కుదిపేసిన హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లు

Also read: Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్​ కోసం కస్టమర్ల తిప్పలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News