Railways Waiting Ticket: భారత రవాణా వ్యవస్థలో అతిపెద్దది రైల్వే వ్యవస్థ. కోట్లాది ప్రజలు రవాణాగా వినియోగిస్తున్న రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన సేవల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రయాణికులకు భారీ షాకిచ్చింది. భారతీయ రైల్వే జూలై నుంచి ప్రయాణికుల కోసం పెద్ద మార్పు చేసింది. రైల్వే శాఖ తీసుకున్న కొత్త నిబంధనలను జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. వీటిలో ప్రధానంగా వెయిటింగ్ టిక్కెట్లకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుడు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాలని కొత్త నిబంధన తెచ్చింది. లేకపోతే మధ్యలోనే ఆ ప్రయాణికుడిని దించే నిబంధనను కూడా తీసుకురావడం గమనార్హం.
Also Read: Mukesh Ambani: కుమారుడి పెళ్లి భాజాలు.. 50 మంది జంటలకు ముకేశ్ అంబానీ కళ్లు చెదిరే కానుకలు
వెయిటింగ్ టిక్కెట్లపై రిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రయాణించడాన్ని భారతీయ రైల్వే పూర్తిగా నిషేధించింది. టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో సాధారణ టికెట్ కొనుగోలు చేసి ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించాలంటే ఇకపై కష్టమే. కొత్త నిబంధనలు వాటిని నిషేధం విధించింది. వెయిటింగ్ టికెట్లతో రిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రయాణించే సౌకర్యాన్ని తొలగించింది. రిజర్వ్ చేసిన కోచ్‌లలో టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read: Jio Hikes Tariff: కస్టమర్లకు జియో భారీ షాక్.. ఊహించని రీతిలో అన్నీ రేట్లు భారీగా పెరుగుదల
గతంలో ఇలా..
కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ ఉన్న ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో సాధారణ టికెట్ తీసుకునేవారు. అనంతరం వెయిటింగ్ టికెట్‌తోపాటు సాధారణ టికెట్ తీసుకుని రిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రయాణించేవారు. అలాంటి నిబంధనలు గతంలో అమల్లో ఉండేవి. ప్రయాణికుడు ముందు ఏసీ కోసం వెయిటింగ్ టికెట్ కలిగి ఉంటే అతను ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. స్లీపర్ కోసం వెయిటింగ్ టిక్కెట్ ఉంటే స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చు.
రైల్వే అధికారుల మాట ఇది
నిబంధనల మార్పుపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. 'వెయిటింగ్ టికెట్లపై ప్రయాణించడంపై నిషేధం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. బ్రిటీష్ కాలం నుంచి కొత్తగా అమలుచేసిన విధానం ఉంది. ఆ నిబంధనను జూలై నెల నుంచి కచ్చితంగా అమలుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది'. ఇకపై వెయిటింగ్ టికెట్‌తో ఏసీ కోచ్‌లు, స్లీపర్ క్లాస్‌లలో ప్రయాణం నిషేధమని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు ఎక్కాలని సూచించరు.
జరిమానా ఎంత?
ఒకవేళ తెలియకుండా వెయిటింగ్ టికెట్‌తో రిజర్వ్ చేసిన కోచ్‌లో ప్రయాణించే వారిపై రైల్వే శాఖ జరిమానా విధిస్తోంది. అలాంటి ప్రయాణికులను గుర్తిస్తే రూ.440 జరిమానా విధిస్తారు. లేదా టికెట్ కలెక్టర్ సదరు ప్రయాణికుడిని మధ్యలోనే దింపివేస్తారు. ఈ మేరకు కొత్త నిబంధనలు అలా ఉన్నాయి. రిజర్వ్‌డ్ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్ ప్రయాణికులతో ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి