టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తక్కువ ఆదాయం ఉన్న తన ఖాతాదారులకు కరోనా కష్టకాలంలో తన వంతు సాయాన్ని అందిస్తుంది. 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల రీఛార్జ్ ప్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు రూ .79 రీఛార్జ్ చేసుకునే ప్రిపెయిడ్ కస్టమర్లకు ప్యాక్ ద్వారా అందే ప్రయోజనాలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది.
ఎయిర్‌టెల్ రూ .49 మొబైల్ ప్లాన్‌ను ఉచితంగా అందించటం ద్వారా 5.5 కోట్ల తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు తాజా స్కీమ్ ద్వారా రూ .270 కోట్లు విలువను ప్రయోజనం చేకూర్చనుంది. అయితే తన ప్రిపెయిడ్ ఖాతాదారులకు ఒక్కసారి మాత్రమే రూ.49 ప్యాక్ ఉచితంగా ఇవ్వనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా టాక్ టైమ్ ధర రూ.38 మరియు 100 ఎంబీ డేటాను ఎయిర్‌టెల్(Airtel Offers) ఖాతాదారులు పొందనున్నారు.
కరోనా కష్ట కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఎయిర్‌టెల్ వినియోగదారులను, అవసరమైన ఇతర కస్టమర్లకు రీఛార్జ్ సమస్య తొలగించేందుకు ఒక ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.49 మరియు రూ.79 ప్యాక్ ప్రయోజనాలు వచ్చే వారం నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుతాయి. ఈ ఫిబ్రవరి డేటా ప్రకారం ఎయిర్‌టెల్‌కు సుమారు 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఎయిర్‌టెల్ కంపెనీ కోవిడ్ ఎస్ఓఎస్ మరియు కొవిన్(CoWIN) అనే రెండు సెక్షన్లను యాడ్ చేసింది. కోవిడ్ ఎస్ఓఎస్ అనేది మెడిసిన్, ఆక్సిజన్, ప్లాస్మా దాతలు, అంబులెన్స్‌లు, హాస్పిటల్ ఖాళీ బెడ్లు, కరోనా పరీక్షా కేంద్రాలు ఇతరత్రా వివరాలను అందిస్తుంది. కొవిన్ యాప్ ద్వారా మీరు, మీ కుటుంబసభ్యులు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Airtel Offers: 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్‌టెల్ శుభవార్త, ఫ్రీ రీఛార్జ్ ప్లాన్
కరోనా కష్ట కాలంలో వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్
5.5 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల రీఛార్జ్ ప్యాక్
రూ .79 రీఛార్జ్ చేసుకునే ప్రిపెయిడ్ కస్టమర్లకు డబుల్ బెనిఫిట్స్