Aadhaar Update: ఆధార్ కార్డులో పేరులో మార్పులు, చిరునామా, పుట్టిన తేదీ మార్పుల్ని సంబంధిత డాక్యుమెంట్లతో సరి చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, జెండర్, ఫోటోగ్రాఫ్ ఇతర బయోమెట్రిక్ వివరాలు మార్పుకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. ఆధార్ అప్డేట్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం, ఆన్లైన్లో ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.
ఆధార్ కార్డు మోడిఫై చేసేందుకు కావల్సిన డాక్యుమెంట్లను యూఐడీఏఐ వర్గీకరించింది. దీని ప్రకారం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరు, చిరునామా మార్చేందుకు ఈ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
1. పాస్‌పోర్ట్
2. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు
3. పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అవసరమౌతాయి
4. మార్క్‌షీట్
5. టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు
6. బర్త్ సర్ఠిఫికేట్
7. పుట్టిన తేదీలో మార్పులకు సంబంధిత కార్పొరేషన్ లేదా అథారిటీ జారీ చేసే బర్త్ సర్టిఫికేట్‌తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ అవసరమౌతుంది.
డేటా యూక్యురేట్గా ఉండేందుకు ప్రతి పదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిదని యూఐడీఏఐ సూచిస్తోంది. ఇందులో భాగంగానే ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసు ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకూ ఈ ఉచిత అప్డేట్ సర్వీసు అందుబాటులో ఉండింది.
Also read: Tax Exemptions: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త, కొత్త ట్యాక్స్ విధానంలో త్వరలో కొన్ని మినహాయింపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook