Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి. అందుకే ఇది చాలా ముఖ్యమైంది. అందుకే ఆధార్ కార్డు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. తెలిసో తెలియకో మీరు చేసే తప్పులు, పొరపాట్ల కారణంగా మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ కావచ్చు. అదెలా తెలుసుకోవచ్చో పరిశీలిద్దాం.
యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ఆధార్ కార్డు ప్రస్తుతం వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాలు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాకింగ్ ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవహారాలకు కావల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అందుకే ఆధార్ కార్డు సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించుకోవాలి. మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా ఎక్కడైనా దుర్వినియోగం అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డును ఆర్ధిక లావాదేవీలు, ఐడీ దొంగిలించడం, వ్యక్తిగత డేటా చోరీ చేయడం, బ్యాంకు ఎక్కౌంట్లు ఖాళీ చేయడం వంటి మోసాల్లో ఉపయోగించే అవకాశముంది.
ఆధార్ కార్డు దుర్వినియోగమైందా లేదా ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి
ముందుగా మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇప్పుడు అథెంటిఫికేషన్ హిస్టరీ చెక్ చేయాలి. ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ ఎప్పుడు వినియోగమైందో డేటా కన్పిస్తుంది. అందులో ఏమైనా అనుమానాస్పద డేటా కన్పిస్తే అంటే మీకు ప్రమేయం లేదని అన్పిస్తే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ వివరాలు లాక్ చేయడం ఎలా
మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయాలి, ఇప్పుడు Lock/Unlock Aadhaar క్లిక్ చేసి అక్కడ ఇచ్చే మార్గదర్సకాలు చదివి ప్రొసీడ్ అవాలి. ఇప్పుడు మీ వర్చువల్ ఐడీ, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా నమోదు చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. లాకింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే లాక్ అయిపోతాయి.
ఆధార్ కార్డు దుర్వినియోగం రిపోర్ట్ చేసేందుకు 1947 నెంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయడం లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఆధార్ కార్డు భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా నియంత్రించాలంటే ఫోటోస్టాట్ కాపీలపై సంతకం చేసేటప్పుడు టైమ్ అండ్ డేట్‌తో పాటు ఎందుకు ఇస్తున్నారో ప్రస్తావించాలి. మాస్క్డ్ ఆధార్ కార్డు మాత్రమే ఉపయోగించాలి. ఇందులో మొదటి 8 నెంబర్లు కన్పించవు.
Also read: Who is Kevan Parekh: ఆపిల్ కంపెనీ కొత్త సీఎఫ్ఓ కేవన్ పరేఖ్ ఎవరు, ఈ పదవికి ఆయనే ఎందుకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా ఆపాలి