Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇంట్లోంచే ఇలా మార్చుకోవచ్చు

Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకునేవారికి గుడ్‌న్యూస్, ఉచితందా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. గత పదేళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేయనివారికి మంచి అవకాశం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2023, 06:17 AM IST
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇంట్లోంచే ఇలా మార్చుకోవచ్చు

Aadhaar Card Update: ఆధార్ కార్డులో చిరునామా లేదా బయోమెట్రిక్ వంటి వివరాలు అప్‌డేట్ చేసేందుకు గడువు తేదీ మరో మూడు నెలలు పొడిగించారు. 2024 మార్చ్ వరకూ ఆధార్ అప్‌డేట్ ఉచితంగా చేయించుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆధార్ అప్‌డేట్‌లో భాగంగా అడ్రస్ ప్రూఫ్, పేరులో మార్పులు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఫోటో, బయోమెట్రిక్ వివరాలను ఏ విధమైన ఖర్చు లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అనేది ఇప్పుడు ఐడెంటిటీ కోసం ప్రాధమిక డాక్యుమెంట్‌గా ఉంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అర్హులైనవారికి ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేయనివారికి త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. 

గత పదేళ్లుగా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయనివారు తప్పకుండా ఆధార్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ తప్పకుండా వెరిఫై చేయించుకోవాలి. ఆధార్ కార్డు అడ్రస్ అప్‌డేట్ మై ఆధార్ పోర్టల్ ద్వారా ఎవరైనా సరే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియలో ఇబ్బంది ఉంటే మీ సమీపంలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్ సెంటర్‌లో ఆఫ్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేయించుకోవచ్చు.

ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ ఇలా

ఆధార్ సెల్ఫ్ అప్‌డేట్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/.ఓపెన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆన్‌లైన్ అప్‌డేట్ సర్వీసెస్ ఎంచుకుని అక్కడ్నించి అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ ఎంచుకోవాలి. ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్ ఎంచుకుని కావల్సిన అప్‌డేట్ ఎంచుకోవాలి. అవసరమైన సమాచారం సపోర్టింగ్ డాక్యుమెంట్లతో అప్‌లోడ్ చేయాలి.

అప్‌డేట్ స్టేటస్ చెక్ ఇలా

ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే 14 అంకెల యూఆర్ఎన్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Also read: Top 3 Electric SUV Cars: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్లాన్ చేస్తున్నారా, త్వరలో లాంచ్ కానున్న టాప్ 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News