7th Pay Commission DA Hike News: జనవరి 1, 2024 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతం అనేది ఖరారైంది. అయితే ఏఐసీపీఐ ఇండెక్స్ సూచీ ఇంకా పెండింగులో ఉన్నందున 51 శాతం అనేది ఇంకా తేలలేదు. మరో 13 రోజులు నిరీక్షిస్తే కేంద్ర ప్రబుత్వం ఉద్యోగులకు పెరిగిన డీఏ చేతికి అందుతుంది.
జనవరి 31న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పెరిగిన డీఏ అదే రోజు విడుదల కానుంది. జనవరి 2024 నుంచి ఎంత డీఏ లబిస్తుందనేది ఈ నెలాఖరున తేలనుంది. పెరిగిన డీఏ కచ్చితంగా 50 శాతం ఉంటుందని తెలుస్తోంది. ఏఐసీపీఐ ఇండెక్స్ భారీగా పెరగడం, ద్రవ్యోల్బణం అనేవి డీఏ పెంపుకు దారి తీస్తున్నాయి. అయితే జనవరి 1, 2024 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం డీఏ లభిస్తుందనేది ఖాయమైంది. ఏఐసీపీఐ సూచీ విడుదలైతే 51 శాతం వస్తుందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఆ సూచీలో భారీ పెరుగదల ఉంటే జనవరి నుంచి డీఏ పెంపు 50.52కు చేరవచ్చు. అందుకే సరాసరిన 50 శాతం పెంపు ఖాయమైందని చెప్పవచ్చు. అంటే దాదాపుగా 4 శాతం పెరిగినట్టు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ లెక్కగట్టే డేటా ఏఐసీపీఐ నవంబర్ నెలకు సంబంధించిన సూచీ విడుదలైంది. 07 పాయింట్లు పెరిగినట్టు తెలుస్తోంది. డియర్‌నెస్ అలవెన్స్ స్కోర్ 0.60 శాతం పెరిగి 49.68 శాతానికి చేరుకుంది. ఈ గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతమనేది తేలిపోయింది. ఏఐసీపీఐ డసెంబర్ సూచీ గణనీయంగా పెరిగితే డీఏ పెంపు 5 శాతం కూడా ఉండవచ్చు.
జనవరి 2024 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 540 శాతం డిఏ అందుకుంటారు. ఆ తరువాత డిఏ అనేది జీరోకు చేరుతుంది. అంటే అప్పటి వరకూ పెరిగింది బేసిక్ శాలరీలో కలిపి తిరిగి 0.50 శాతం నుంచి లెక్కిస్తారు.అంటే ఓ ఉద్యోగి కనీస వేతనం 18 వేలుంటే..50 శాతం డీఏ ప్రకారం 9000 అతని బేసిక్ జీతానికి చేర్చేస్తారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన ప్రతిసారీ ఉద్యోగి అందుకునే డీఏను కనీస వేతనానికి కలుపుతుంటారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం డీఏ 100 శాతముంటే జీతంలో కలపాలి.
కానీ ఇది సాధ్యం కానే కాదు. అయితే 2016లో ఇలా జరిగింది. అంతకుముందు 2006లో ఆరవ వేతన సంఘం వచ్చినప్పుడు 5వ వేతన సంఘం ప్రకారం డీఏ 187 శాతం ఉన్నది. అప్పుడు ఆ మొత్తం 187 శాతం DAను కనీస వేతనానికి కలిపారు. ఆ తరువాత ఆరవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది.ఇప్పుడు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. త్వరలో 8వ వేతన సంఘం మొదలు కానుంది.
Also read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, తిరిగి పాత పెన్షన్ విధానం అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook