Cheap and Best Phone: నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్!!

రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ. 500లోపు ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది. రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 10:03 PM IST
  • తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్త
  • నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్
  • మూడు వేరియంట్లలో రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌
Cheap and Best Phone: నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్!!

Redmi 9 Power smartphone available on Flipkart for 479 EMI: తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది. చైనా మొబైల్ సంస్థ రెడ్​మీ.. రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను చాల రోజుల క్రితం  లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మొబైలే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు ఈఎంఐతో అందుబాటులో వచ్చింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియా మరియు ఎంఐ.కామ్‌లో అమ్మకానికి అందుబాటులో లేదు.

రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో (4GB RAM + 64GB, 4GB RAM + 128GB, 6GB RAM + 128GB) అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,799 ధరకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,989గా నిర్ణయించారు. ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్ రూ. 479 ప్రారంభ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.

రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్ బ్యాక్ కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

రెడ్​మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బరువు 198 గ్రాములుగా ఉంది.

Also Read: DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News