అమెరికాలో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో మన దగ్గర కూడా 5జీ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే 4జీ నుంచి 5జీలోకి మారేందుకు సింహభాగం వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలు కూడా వెల్లడించాయి. దీంతో రానున్న రోజుల్లో 5జీ సేవలకు భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీలు కూడా ఇప్పటి నుంటే ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఈపాటికే 5జీ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నాయి. 5జీ నెట్వర్క్ లాంచ్ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. స్పెక్ట్రమ్ వేలంతో కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈమేరకు కేంద్రం కసరత్తు చేస్తోందని చెప్పారు. 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర టెలికాంశాఖ మంత్రి మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఏ ధరలకు స్పెక్ట్రమ్ విక్రయించాలనే దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వేలంపాటకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. 5జీ నెట్వర్క్ సేవలో అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటనతో స్పెక్ట్రమ్ వేలంపై క్లారిటీ వచ్చేసింది. కేంద్రం జూన్ లో వేలం పాట నిర్వహిస్తే.... ఆగస్టు - సెప్టెంబర్ కల్లా 5జీ నెట్వర్క్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లోగా భారత్‌లో 5జీ సేవలు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
టూ జీ స్పెక్ట్రమ్ వేలం పాట కారణంగా అప్పట్లో యూపీఏ సర్కారు చాలా అపఖ్యాతి పాలైంది. ఆ పొరపాటు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర జాగ్రత్తగా కసరక్తు చేస్తోంది. 5సీ స్పెక్ట్రమ్ వేళం ద్వారా కేంద్రానికి ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా కేంద్రానికి నివేదిక ఇచ్చింది. వేలం ద్వారా ఆయా టెలికం సంస్థలకు 30ఏళ్ల పాటు విభిన్న బ్యాండ్లలో 1లక్ష మెగాహెర్ట్జ్‌లను కేంద్రం కేటాయించనుంది. ఒకవేళ ఇది 20 సంవత్సరాలకు తగ్గితే వేలం విలువ రూ.5.07లక్షల కోట్లకు తగ్గిపోనుంది. అయితే ఎంత కాలానికి ఏ ధరకు వేళం వేయాలనేదాని పై కేంద్రం సమాలోచనలు జరుపుతోంది. మొత్తంగా సెప్టెంబర్ నాటికి భారత్‌లో 5జీ నెట్వర్క్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈపాటికే పలు నగరాల్లో టెలికం సంస్థలు 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. కేంద్రం నుంచి ఏ క్షణమైనా పిలుపు వచ్చే అవకాశం ఉండడంతో టెలికాం సంస్థలు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.
also read
పే పర్ మూవీ ఫీచర్ తీసుకొచ్చిన అమోజాన్
Mobile Charging Tips: మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ 5 తప్పులు చేయకండి!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook