Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!

Hyundai Cars Discount and Offers in May 2023. హ్యుందాయ్ కంపెనీ తన గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, i20 N లైన్, కోనా EVలపై నగదు తగ్గింపులు మరియు అదనపు తగ్గింపులను అందిస్తోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 9, 2023, 06:24 PM IST
Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!

Hyundai Cars Discount and Offers in May 2023: భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో 'హ్యుందాయ్' ఒకటి. భారత ఆటో మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీకి మంచి క్రేజ్ ఉంది. భారీ బడ్జెట్ కార్లను మాత్రమే కాకుండా.. సామాన్యులకు అందుబాటులో ఉండే కార్లను కూడా రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా కారు భారత మార్కెట్‌ను శాసిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ఎప్పటికపుడు కొన్ని కార్లపై డిస్కౌంట్లను అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే 2023 మేలో కూడా కొన్ని కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ తన గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, i20 N లైన్, కోనా EVలపై నగదు తగ్గింపులు మరియు అదనపు తగ్గింపులను అందిస్తోంది. ఆ ఆఫర్‌ల గురించి ఓసారి చూద్దాం.

Hyundai Grand i10 Nios:
హ్యుందాయ్ కంపెనీ తన గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనితో పాటు కంపెనీ అదనంగా రూ.10,000 తగ్గింపును కూడా ఇస్తోంది. అదే సమయంలో POI / కార్పొరేట్ కస్టమర్‌లు కూడా రూ. 3,000 వరకు తగ్గింపును పొందతునున్నారు. ఈ కారుపై మొత్తం తగ్గింపు రూ.38,000 వరకు ఉంటుంది.

Hyundai Aura:
హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ రూ. 20,000 నగదు తగ్గింపు మరియు రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో POI/కార్పొరేట్ కస్టమర్ విడిగా రూ. 3,000 తగ్గింపును పొందుతున్నారు. మొత్తంగా ఈ కారుపై ఆఫర్ రూ.33,000కి చేరుకుంది.

Hyundai i20 & i20 N Line:
హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉన్న మాగ్నా మరియు స్పోర్ట్జ్ ట్రిమ్‌లపై రూ. 10,000 వరకు నగదు తగ్గింపు అందించబడుతోంది. అయితే వినియోగదారులు పాత కారును మార్చుకుంటే.. రూ. 10,000 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఐ20లో కస్టమర్లు మొత్తం రూ.20,000 వరకు ఆఫర్‌ను పొందనున్నారు.

Hyundai Kona EV:
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోనా కూడా బాగా పాపులర్ అయింది. ఈ కారుపై రూ. 50,000 వరకు నగదు తగ్గింపును లభిస్తోంది. అయితే ఎక్స్‌ఛేంజ్‌ కస్టమర్‌లు లేదా POI/కార్పొరేట్ కస్టమర్‌లకు అదనపు తగ్గింపు అందుబాటులో లేదు.

Also Read: 2023 Upcoming Electric SUVs: టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా సహా.. ఈ 6 ప్రసిద్ధ ఎస్‌యూవీల ఎలక్ట్రిక్ వెర్షన్స్ వస్తున్నాయి!  

Also Read: MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీ రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News