Andhra University Question Paper: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కంటే.. నెగిటివిటీనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఏదో రకంగా సోషల్ మీడియాలో ఆ పార్టీకి చేపట్టే కార్యక్రమాలను నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికి వైసీపీ రంగులు వేయడంపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ జరిగాయి. తాజాగా ఆంధ్రా యూనివర్సీటి ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీకి.. ప్రశాపత్రానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా..? ఆ ప్రశ్నాపత్రంలో అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఏ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగిందని.. ఆ పరీక్షా పత్రంలో 'వైఎస్సార్‌సీపీ విధానాల గురించి మరియు కార్యక్రమాల వివరించండి' అని ప్రశ్న అడిగినట్లు ఇచ్చారంటూ క్వశ్చన్ పేపర్‌ను వైరల్ చేస్తున్నారు. పరీక్షల్లో పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అడగడం ఏంటని కొందరు మండిపడుతున్నారు.
తాను ఈ పరీక్ష హాజరయ్యాయనని కృష్ణాజిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి బాలాజీ తెలిపారు. ప్రశ్నాపత్రంలో వైసీపీ విధానాలు, కార్యక్రమాల గురించి అడగటం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రశ్నలు ఎలా అడుగుతారని నిలదీశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్వచ్ఛన్ పేపర్ వైరల్ అవుతుండడంతో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి స్పందించారు. మచిలీపట్నంలో క్వశ్చన్ పేపర్ వైరల్ అవుతున్నట్లు తెలిసిందన్నారు. ప్రశ్నాపత్రంలో అలాంటి ప్రశ్న అడిగార లేదా అనే విషయం ఆరా తీస్తున్నామన్నారు. త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు కొందరు ఈ ప్రశ్నాపత్రం ఫేక్ అని ఖండిస్తున్నారు. కావాలనే కొందరు క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రశ్నాపత్రంపై పూర్తి స్పష్టతం రావాల్సి ఉంది.
Also Read: HBD Virat Kohli: నాన్న కల.. అన్నకు ఇచ్చిన మాట.. విరాట్ కోహ్లీ జీవితంలో కన్నీటి గాథ
Also Read: Shahid Afridi: భారత్‌ను సెమీస్‌లో ఆడించాలనే.. ఐసీసీ అలా చేసింది! షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి