YSRCP Twitter: వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పిచ్చి పిచ్చి ట్వీట్లు

YSRCP Twitter Hacked: వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ట్విట్టర్ ఖాతా నుంచి రాత్రి నుంచి పిచి పిచ్చి పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ ఐటీ విభాగం అలర్ట్ అయింది. ట్విట్టర్ ఖాతాను పునరుద్ధించేందుకు యత్నిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 11:18 AM IST
  • వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
  • పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తున్న హ్యాకర్లు
  • ఖాతాను పునరుద్ధించేందుకు వైసీపీ ఐటీ వింగ్ యత్నం
YSRCP Twitter: వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పిచ్చి పిచ్చి ట్వీట్లు

YSRCP Twitter Hacked: ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాకర్ చేశారు. వైఎస్సార్సీపీ పేరు మారు పేరు పెట్టారు. మొదట NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేయగా.. మళ్లీ YSR Congress Party గా మార్చారు. లోకేషన్ యూఎస్‌ఏ ఉన్నట్లు చూపిస్తోంది. ట్విట్టర్ కింద మాత్రం NFT MILLIONARIE అలానే ఉంది. హ్యాకర్లు రాత్రి నుంచి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తుండడంతో నెటిజన్లకు అర్థం కాలేదు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఐటీ విభాగం ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్రోల్స్ మొదలు పెట్టేశారు.  

 

వైసీపీకి సంబంధించి ప్రొఫైల్ పిక్, కవర్ ఫొటో, బయోడేటాను మార్చేశారు హ్యాకర్లు. క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యానికి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సిబ్బంది కంప్లైంట్ చేశారు. ఇందుకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు నెలల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు టైలర్‌ హాబ్స్‌ పేరుతో టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు మార్చారు. అప్పుడు టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌ పోస్టులు కనిపించాయి. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ ఐటీ వింగ్.. ట్విట్టర్ యాజమాన్యాన్ని సంప్రదించి మళ్లీ అకౌంట్‌ను రికవరీ చేసింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు  

Also Read: Health Insurance: తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను చెక్ చేయండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News