LG 9 Kg Washing Machine: LG 9 కేజీ వాషింగ్‌ మెషిన్‌పై కళ్లు చెదరే డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

LG 9 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే కొత్త AI DD ఫీచర్స్ కలిగిన మంచి వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్ లో అతి తక్కువ ధరకే ఎల్జీ కంపెనీకి సంబంధించిన వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 9, 2024, 11:29 AM IST
LG 9 Kg Washing Machine: LG 9 కేజీ వాషింగ్‌ మెషిన్‌పై కళ్లు చెదరే డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

LG 9 Kg Washing Machine Price Cut: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మిషన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోని కొత్త AI ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషన్స్‌ను  ప్రస్తుతం అన్ని కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొన్ని మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషన్స్‌ ధరలు కాస్త ఎక్కువే అయినప్పటికీ, దీనిని దృష్టిలో పెట్టుకొని ఇతర ఎలక్ట్రిక్ కంపెనీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నాయి. ముఖ్యంగా LG లాంటి పెద్ద కంపెనీలకు సంబంధించిన వాషింగ్ మిషన్స్ కొనుగోలు చేయాలంటే తప్పకుండా రూ.25 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అమెజాన్ తమ సాధారణ కష్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బ్రాండ్ కు సంబంధించిన Ai DD టెక్నాలజీ తో కూడిన వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ వాషింగ్ మెషన్స్‌పై ఆధానంగా ఫ్లాట్ డిస్కౌంట్ అందించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషన్స్‌ పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్ ఏంటో ఏ వాషింగ్ మిషన్ అతి  చౌకగా లభిస్తుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో LG 9 Kg 5 స్టార్ ఇన్వర్టర్ పూర్తిగా-ఆటోమేటిక్ టాప్ లోడ్ (THD09NPF, మిడిల్ ఫ్రీ సిల్వర్, AIDD టెక్నాలజీ) వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరకి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషన్స్‌  ఐదు కెపాసిటీ వేరియంట్లలో అందుబాటులో ఉండగా ఇందులో టాప్ వేరియంట్ రూ. 35,999లకు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వాషింగ్ మెషిన్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ వివరాలు కి వెళ్తే.. దీనిని ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి 31% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.24,990కే పొందవచ్చు. 

అలాగే ఈ వాషింగ్ మెషిన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా భారీ తగ్గింపు లభించనంది. ఇక ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా వన్ కార్డు, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.21,990కే పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ముఖ్యంగా అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్స్‌ను స్మార్ట్ ఫోన్స్ పై అందించడమే కాకుండా వాషింగ్ మెషన్స్‌పై కూడా అందిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్ లో భాగంగా LG 9 Kg 5 స్టార్ ఇన్వర్టర్ పూర్తిగా-ఆటోమేటిక్ టాప్ లోడ్ (THD09NPF, మిడిల్ ఫ్రీ సిల్వర్, AIDD టెక్నాలజీ) వాషింగ్ మెషిన్‌ ను కొనుగోలు చేసే వారికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత వాషింగ్ మిషన్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4,250 వరకు తగ్గింపు లభించే అవకాశాలున్నాయి. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను చివరకు ఈ వాషింగ్ మెషిన్‌ రూ. 17 వేల లోపే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషిన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News