పెళ్లిళ్లకు వెళతారు, ఎన్నికలనేసరికి కరోనా.. ఇదేనా మీ నీతి..

రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా అధికార విపక్షాల మధ్య  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. కాగా వైస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..

Last Updated : Mar 17, 2020, 04:38 PM IST
 పెళ్లిళ్లకు వెళతారు, ఎన్నికలనేసరికి కరోనా.. ఇదేనా మీ నీతి..

అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా అధికార విపక్షాల మధ్య  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. కాగా వైస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో  బాగానే తిరుగుతున్నారని, పెళ్లిళ్లు, మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఎన్నికల కమిషనర్ కరోనా సాకును చూపి వాయిదా వేయడం వెనక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా పడగానే టీడీపీ నాయకులు గెలిచినట్టు ఫీలవుతున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమదే గెలుపని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విపక్ష కుట్రలన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. టీడీపీని ప్రజలు తగిన శిక్ష విధించే సమయం ఆసన్నమైందని అన్నారు. 

నేడు రాజ్యసభలో రాష్ట్రంలోని రైల్వేల పనితీరుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను వెంటనే ప్రారంభించడంతో పాటు విశాఖ నుంచి కొత్త రైళ్ళ కోసం రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News