Gorantla Madhav: గోరంట్ల మాధవ్ ఒరిజనల్ వీడియో ఉందట! అనంతపురం జిల్లాలో ఎంపీ టూర్ రచ్చ..

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచనమైన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. మాధవ్ కు సంబంధించి వైరల్ గా మారిన వీడియో ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా వివాదం చల్లారడం లేదు.

Written by - Srisailam | Last Updated : Aug 14, 2022, 04:26 PM IST
  • అనంతపురం జిల్లాలో గోరంట్ల రచ్చ
  • వీడియో తర్వాత జిల్లాకు మాధవ్
  • నా దగ్గర ఒరిజినల్ వీడియో ఉంది- మాధవ్
Gorantla Madhav: గోరంట్ల మాధవ్ ఒరిజనల్ వీడియో ఉందట! అనంతపురం జిల్లాలో ఎంపీ టూర్ రచ్చ..

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచనమైన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. మాధవ్ కు సంబంధించి వైరల్ గా మారిన వీడియో ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా వివాదం చల్లారడం లేదు. మాధవ్ వివాదం అనంతపురం జిల్లాలో కులాల కుంపట్లు రాజేసింది. కమ్మ, కురుబ సామాజికవర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెన్షన్ కొనసాగుతుండగానే జిల్లాకు వచ్చారు ఎంపీ గోరంట్ల మాధవ్. తన వీడియో బయటికి వచ్చాకా తొలిసారి జిల్లాకు రావడంతో ఆయన అనుచురులు ఘనంగా స్వాగతం పలికారు. తన అనుచరులతో కలిసి హిందూపురంలో భారీ ర్యాలీకి మాధవ్ ప్లాన్ చేశారు. అయితే గోరంట్ల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఫేక్ వీడియోతో తనపై  దుష్ప్రచారం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించి.. అది ఫేక్ అని ఆ నేతలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. బీసీలను అనగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఒరిజినల్ వీడియో ఉందని చెప్పి బాంబ్ పేల్చారు గోరంట్ల మాధవ్. తన వద్ద ఒరిజినల్ వీడియో ఉందంటూ మాధవ్ చెప్పడం సంచలనంగా మారింది. మాధవ్ వీడియో ఫేక్ అని ప్రకటించిన సమయంలో.. ఒరిజినల్ వీడియో దొరికేతే కాని విచారణ చేయలేమని అనంతపురం జిల్లా ఎస్పీ చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామన్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవే తన దగ్గర ఒరిజనల్ వీడియో ఉందని చెప్పడంతో.. పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిజాలు రాబట్టాలనే డిమాండ్ వస్తేంది.

మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. మాధవ్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోనికి తీసుకున్నారు. కొందరు టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేశారు. చంద్రదండు ప్రకాష్ నాయుడు, అనంతపురం జిల్లా పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి సరిపూటి రమణvg హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Revanth Reddy: రేవంత్ ను ఇరికించే పనిలో సీనియర్లు.. మునుగోడులో తేడా వస్తే పీసీసీ అవుట్?  

Read Also: Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త హత్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News