విజయవాడ : తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుని తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో ( Fibergrid scam ) టీడీపీ నేత నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా ( APIIC Chairperson RK Roja ) ఆరోపించారు. లేదంటే తండ్రి శాఖకు సంబంధించిన ఫైల్‌పై సంతకం పెట్టాల్సిన అవసరం లోకేష్‌కి ( Nara Lokesh ) ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ చేత విచారణ జరిపిస్తే నిజాలన్నీ వాటంతటవే వెలుగులోకొస్తాయని అన్నారు. అమరావతిలోనూ లక్ష కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడే ఆ కుంభకోణాలకు పాల్పడ్డారని రోజా ఆరోపించారు. Also read : AP: ఆలయ అపశృతులపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అమరావతిలో అవినీతికి పాల్పడకపోతే.. అంతా టీడీపీ నేతలు, ఒక్క సామాజికవర్గానికి చెందిన వాళ్లే అక్కడ భూములు ఎలా కొనగలిగారని రోజా నిలదీశారు. అంతవరకు ఎందుకు అమరావతి అంటే చంద్రబాబుకి ఒక ఏటీఎం ( ATM ) లాంటిదని స్వయంగా దేశ ప్రధాని మోదీనే అన్నారని గుర్తుచేసిన రోజా.. అందుకే అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
Tirumala decleration కొత్తగా తిరుమల డిక్లరేషన్ అంటూ రాజకీయాలు ఎందుకు ?:
సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు తిరుమలను సందర్శించారు. అప్పుడు ఎప్పుడూ లేని డిక్లరేషన్ రాజకీయాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు చేస్తున్నారంటూ రోజా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం జగన్‌ని ( CM YS Jagan ) విమర్శించే అర్హత చంద్రబాబుకు లేనే లేదు. ఎందుకంటే 40 ఆలయాలను కూలగొట్టించి, కాలి బూట్లతోనే పూజలు చేసిన వ్యక్తి చంద్ర బాబు. కానీ తమ ముఖ్యమంత్రి జగన్ అలాంటి నాయకుడు కాదు. శ్రీవారి మీద భక్తికో సీఎం జగన్ కాలినడకన తిరుమల కొండకు వెళ్లడమే కాకుండా పాదయాత్రకు ముందు, ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమలలో దర్శనం ( CM YS Jagan's visit to Tirumala ) చేసుకున్నారని అన్నారు. గతేడాది ప్రధాని మోదీ తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. మరి ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వస్తోందని రోజా మండిపడ్డారు. Also read : Tirumala Declaration: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe