Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు

YSR Statue Removed In Ippatam: ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ తీవ్ర ఉద్రిక్తంగా మారగా.. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించకుండా వదిలివేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా ఫైర్ అయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 01:41 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు

YSR Statue Removed In Ippatam: మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు, గోడలు కూల్చివేత తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం కక్ష కట్టిందంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారని.. మరి వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా  ఎందుకు వదిలేశారని నిలదీశారు. 

సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై నెటిజన్లు‌ సెటైర్లు వేస్తూ.. భారీగా ట్రోలింగ్ చేశారు. దీంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటం గ్రామంలో ‌వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. క్రేన్ సాయంతో విగ్రహం తరలించారు. గాంధీ, నెహ్రూ మహానుభావుల విగ్రహాలతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా తీసేశారు.

ఇటీవల ఇళ్ల కూల్చివేతపై ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రోడ్టు మీదకు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎందుకు తొలగించలేకపోయారని ప్రశ్నించారు. అంతకుముందు జనసేన పార్టీ కార్యాలయం వద్దే పవన్‌ను పోలీసులు అడ్డుకోగా.. మూడు కి.మీ పాదయాత్రగా వెళ్లిపోయారు. అనంతరం కాన్వాయ్ ఎక్కి ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. 

మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు. అమరావతిలో ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించినా ఎక్కడ స్థలం దొరకలేదు. ఇప్పటం వాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకు రావడమే ఇళ్ల కూల్చివేతలు కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన సభ జరిగిన తరువాత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల వెడల్పులో రోడ్డు ఉంది. దీనిని ఇప్పుడు 120 అడుగుల రోడ్డు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది.

Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్డు సంచలన తీర్పు   

Also Read: Hardik Pandya: హర్ధిక్ పాండ్యా హిట్ వికెట్.. సైలెంట్‌గా బెయిల్స్ వికెట్లపై పెట్టేశాడు.. వీడియో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News