Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఇప్పుడు తొలిసారిగా సీబీఐ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. సీబీఐ వ్యవహారంపై న్యాయపరమైన చర్చలు చేపట్టేందుకు జగన్ తరపు న్యాయవాదులు యోచిస్తున్నారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఇవాళ తాజాగా ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఆఫిడవిట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బాబాయ్ హత్య సంగతి వైఎస్ జగన్‌కు ముందే తెలుసని సీబీఐ అఫిడవిట్‌లో ప్రస్తావించడం కలకలం రేపుతోంది. దీంతో హైకోర్టు అవినాష్ రెడ్డి చెప్పారా అని ప్రశ్నించగా ఆ విషయం దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది.
వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 12.27 గంటల్నించి 1.10 వరకూ అవినాష్ రెడ్డి వాట్సప్ కాల్స్ మాట్లాడుతున్నారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య గురించి పీఏ కృష్ణారెడ్డి ఉదయం 6.15 గంటలకు బయటపెట్టడానికి ముందే..ముఖ్యమంత్రి జగన్‌కు సమాచారం వెళ్లినట్టుగా సీబీఐ పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు అవసరమని సీబీఐ స్పష్టం చేసింది.
మండిపడుతున్న జగన్ తరపు న్యాయవాదులు
సీబీఐ కొత్తగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించడాన్ని జగన్ తరపు న్యాయవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కావాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ వ్యవహారంపై సీబీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook