YS Sharmila Tears: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కుటుంబంలో భారీ చీలికలు వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబంలో విభేదాలపై ఓ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ స్పందించారు. షర్మిలతో గొడవ విషయమై ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల కొంత నొచ్చుకున్నారు. భావోద్వేగానికి గురయి కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు
కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఓ ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ సవాల్ చేశారు. రాజకీయ కాంక్ష ఉండడంతోనే షర్మిల బయటకు వెళ్లినట్లు జగన్ చెప్పడాన్ని తప్పుబట్టారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు తనను ప్రచారం చేయాలని కోరింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, 2019 ఎన్నికల్లో 'బై బై బాబు' ప్రచారం చేసింది నేను కాదా? అని నిలదీశారు. 'నాకు రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్సార్‌సీపీని కూల్చేదాన్ని కాదా' అని పేర్కొన్నారు. 'నా బిడ్డలు, కుటుంబాన్ని వదిలేసి రోడ్లపై జగన్ కోసం తిరిగింది నేను కాదా? జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది నేను కాదా?. నాకు రాజకీయ కాంక్ష ఉంటే పార్టీలో పదవులు మొండిగా పొందేదాన్ని' అని షర్మిల వివరించారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ సంచలనం.. పిఠాపురంలో మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు
'నాకు రాజకీయ కాంక్ష, డబ్బు వ్యామోహం ఉందా అని జగన్ మనస్సాక్షిగా నమ్ముతున్నారా? జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు రాజకీయ కాంక్ష, డబ్బు వ్యామోహం లేదు. తాను చేసిందంతా నేను మా అన్న కోసం చేశా. వైఎస్సార్ సంక్షేమాన్ని మళ్లీ అందించేందుకు పనిచేశా' అని తెలిపారు. 'బైబిల్ మీద ఒట్టేసి చెబుతున్నా. రాజకీయ కాంక్ష.. డబ్బు కాంక్ష లేదు అని చెప్పగలను. ఏ రోజయినా ఒక పదవి కానీ, ఏ విధమైన ఆశ.. పోస్టు కానీ నేను అడగకుండా మీకోసం చేశాను. ఇది నిజం. ఇది బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా. మీరు బైబిల్ మీద వేసి చెబుతారా' అని జగన్‌కు సవాల్ విసిరారు.
'మనిషిని మనిషిగా చూడడం వైఎస్సార్ నుంచి జగన్‌కు ఎందుకు రాలేదు. నేను ఏ రోజు పైసా సహాయం అడగలేదు. మా నాన్న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి డబ్బులు ఆశించలేదు. నేను నా భర్త ఒక సహాయం కూడా అడగలేదు. మేం అడిగామని జగన్ నిరూపిస్తారా?' అని సవాల్ విసిరారు. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ విఫలమయ్యాడని షర్మిల తెలిపారు. 'నిస్వార్థంగా త్యాగం చేస్తే.. మీ కోసం నిలబడడం చేశా. ఇంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నేను పని చేశానని చెప్పారే' అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కొంత కన్నీంటి పర్యంతమయ్యారు. తాను ఏనాడూ జగన్ ఒక్క పదవి, డబ్బు ఎలాంటివి ఆశించలేదు అని ఈ సమావేశం ద్వారా షర్మిల స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter