YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిల

YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2024, 06:58 PM IST
YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిల

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. ఇన్నాళ్లు తన సోదరుడు, సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేసిన షర్మిల ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విమర్శలు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురినీ షర్మిల ఏకీ పారేశారు. రాజధానితోపాటు రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై ముగ్గురిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల 'ఏపీ న్యాయ యాత్ర' గురువారం పలు నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. 'రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు' అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతిపై విమర్శలు చేశారు. 'సింగపూర్ అన్నాడు చంద్రబాబు. త్రీడీ గ్రాఫిక్స్ చూపించారు. 30 వేల ఎకరాలు తీసుకున్నారు. 2015లో మోడీ వచ్చి భూమి పూజ చేశాడు. యమునా నది నుంచి మట్టి తెచ్చాడు. మనకు మిగిలింది చివరికి మట్టి. ఢిల్లీని తలదన్నే రాజధాని ఉండాలని మోడీ చెప్పాడు. బాబు సింగపూర్‌లాంటి రాజధాని అన్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నాడు. అమరావతి కాస్త చివరికి భ్రమరావతి చేశాడు' అని షర్మిల విమర్శించారు. 

Also Read: YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?

 

'హైదరాబాద్ నేనే కట్టా అన్నాడు. హైదరాబాద్ మించిన రాజధాని అని మళ్లీ చెప్పాడు. బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్పా మిగిలింది ఏమి లేదు. దేశ విదేశాలు తిరిగాడు తప్పా... పెట్టుబడులు రాలే. ఉద్యోగాలు లేవు..పరిశ్రమలు లేవు' అని షర్మిల మండిపడ్డారు. 'జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే వాషింగ్టన్ డీసీ అన్నాడు. తర్వాత ఒక్కటి కాదు మూడు అన్నాడు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి దిక్కులేదు' అని గుర్తు చేశారు.

పదేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని తెలిపారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పారు. రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే... మళ్లీ వాళ్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నారు అని కూటమిపై మండిపడ్డారు. మోడీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదు అని విమర్శించారు. ఈ సారి బాబుకి ఓటు వేసినా, జగన్‌కి వేసినా డ్రైనేజీలో వేసినట్లే అని పేర్కొన్నారు. 'మనకు రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. పోలవరం కట్టాలి అంటే కాంగ్రెస్‌ రావాలి. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి' అని షర్మిల తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News