CM Jagan Delhi Tour: చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ ఢిల్లీ టూర్..

ఆంధ్ర రాజధాని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హస్తినకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 10:54 AM IST
  • ఇరకాటంలో జగన్ ప్రభుత్వం
  • జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం
  • అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు
CM Jagan Delhi Tour: చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ ఢిల్లీ టూర్..

CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. హస్తినకు ఆయన ఎందుకు వెళ్లారన్న అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రలు నిర్మలా సీతారామన్, షెకావత్‌, అమిత్ షాలతో జగన్ సమావేశమైన చర్చలు జరిపారు. వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న అంశాన్ని ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ, అటు పార్టీ వర్గాలు కానీ బయటపెట్టలేదు.

అయితే జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అత్యంత కీలకమైన విషయాలను ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ ఆ దిశ దర్యాప్తు ముమ్మరం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవన్నీ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హెంశాఖ సహకారం తమకు అవసరమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొత్తగా వైసీపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమం బీజేపీ సూచించిన ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీకీ, హెంమంత్రి అమిత్ షాకు జగన్ చెప్పినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ముఖేశ్‌ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు గౌతమ్‌ అదానీ ప్రతినిధికి ఎవరికైనా రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

Alo Read: AP New Districts: కొత్త జిల్లాలు, మూడు రాజధానులపై ఇవాళ మోదీతో ఏపీ సీఎం భేటీ

Alo Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న విపక్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News