మోదీ రిలయెన్స్‌కి అంబాసిడరా: సీతారాం ఏచూరి

భారత ప్రధాని నరేంద్ర మోదీ "జైహింద్" అనాల్సింది పోయి "జియో హింద్" అన్నారని.. ఆయన ఏమైనా రిలయెన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్నారా?

Last Updated : Feb 12, 2018, 07:25 PM IST
మోదీ రిలయెన్స్‌కి అంబాసిడరా: సీతారాం ఏచూరి

భారత ప్రధాని నరేంద్ర మోదీ "జైహింద్" అనాల్సింది పోయి "జియో హింద్" అన్నారని.. ఆయన ఏమైనా రిలయెన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్నారా? అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పశ్చిమ గోదావరి భీమవరంలో జరిగిన 25వ సీపీఎం రాష్ట్ర మహాసభల్లో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

జీఎస్టీ వల్ల కేవలం కార్పొరేట్ సెక్టార్ మాత్రమే బాగుపడుతుందని ఏచూరి తెలిపారు. అలాగే నోట్ల రద్దు వల్ల అనేక ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీలు బాగుపడ్డాయని.. కానీ చిన్నమధ్యతరహా పరిశ్రమ పరిశ్రమలు దివాళా తీశాయని అన్నారు.

అలాగే రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీన మేషాలు లెక్కపెడుతుందని.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వేడుక చూస్తుందే గానీ.. పట్టించుకొనే ధోరణిని కనబరచడం లేదని ఏచూరి అన్నారు. త్రిపుర ఎన్నికలలో కూడా గిరిజనులకు, గిరిజనేతరుల మధ్య గీత గీయడానికి సిద్ధమవుతున్న బీజేపీ ఆటలను తాము సాగనీయమని సీతారాం ఏచూరి అన్నారు.

Trending News