Flipkart investment: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఫ్లిప్‌కార్డ్ పెట్టుబడులు

Flipkart investment: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కానుంది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2021, 03:29 PM IST
Flipkart investment: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఫ్లిప్‌కార్డ్ పెట్టుబడులు

Flipkart investment: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కానుంది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి మధ్య జరిగిన సమావేశంలో కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి కనబర్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాల్లో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామి కానుంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైతు ఉత్పత్తులకు మంచి ధర కల్పించడం, స్కిల్ డెవలప్‌మెంట్‌పై చర్చ సాగింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి జగన్ ఫ్లిప్‌కార్ట్ బృందానికి వివరించారు. రైతులు పండించే పంటలకు మంచి ధరలు లభించేలా ఫ్లిప్‌కార్ట్ తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రైతుల ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వినియోగదారులకు అందించేలా చేయాలని సూచించారు. రైతులకు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో సహకరించాలని వైఎస్ జగన్ కోరారు. 

ఐటీ, ఈ కామర్స్ పెట్టుబడులకు విశాఖపట్నం మంచి వేదికని ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan)చెప్పారు. విశాఖలో ఏర్పాటు కానున్న హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీలో భాగస్వామ్యం కావాలని వైఎస్ జగన్..ఫ్లిప్‌కార్ట్‌కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఫ్లిప్‌కార్ట్ (Flipkart Investments in ap)సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ దార్శనికత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. కచ్చితంగా రైతుల్నించి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇది కేవలం రైతులకే కాకుండా తమకు కూడా ప్రయోజనకరమన్నారు. ఇప్పటికే విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయని..మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. వాల్‌మార్ట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టి చాలా బాగుందన్నారు. 

Also read: Winter Effect: రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న చలి తీవ్రత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News