వాయుగుండంగా మారనున్న అల్పపీడనం; తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్రరూపం దాల్చింది

Last Updated : Jul 1, 2019, 10:25 PM IST
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం; తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రేపటి కల్లా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

వాయుగుండం ప్రభావంతో కోస్తా  ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాహుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ  అధికారులు హెచ్చరికలు చేశారు.

ఃఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. అయితే వాయుగుండం  ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారి తెలుగు రాష్ట్రాల్లో  వర్షాలు కురుసే అవకాశముంది. ఇదే జరిగితే వర్షపాతం శాతం మరింత మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Trending News