రోజా Vs చింతమనేని ; క్షమాపణలు చెప్పాల్సిందే.. కుదరదంటే కుదరదు

 వైసీపీ ఎమ్మెల్యే రోాజా, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది

Last Updated : Feb 20, 2019, 08:17 PM IST
రోజా Vs చింతమనేని ; క్షమాపణలు చెప్పాల్సిందే.. కుదరదంటే కుదరదు

దళితులపై చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. నోరుపారేసుకోవడం చింతమనేనికి కొత్తమే కాదని..చంద్రబాబు అండతోనే ఆయన ఇలా రెచ్చిపోతున్నారని విమర్శించారు..దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనితో పాటు చంద్రబాబు  క్షమపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఓ వర్గానికి కించపరిచేలా మాట్లాడినందుకు చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇలా చేయని పక్షంలో దళితులతో కలిసి ఉద్యమిస్తామని రోజా హెచ్చరించారు.

రోజా వ్యాఖ్యలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని స్పందించారు. తనన వ్యాఖ్యాలని ప్రతిపక్షం వక్రీకరిస్తుందని ఎదురుదాడి ప్రారంభించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఇలాగే వక్రీకరించారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షం తనపై దుష్ప్రచారం చేస్తోందని  మండిపడ్డారు. దళితులు బాధపడేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. 

గత నెల మొదటి వారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని  దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. 'మీరు దళితలు, మీకెందుకురా రాజకీయాలు' అంటూ దళితులపై చింతమేనేని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారని వైసీపీ, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్ గా మారింది. ఈ క్రమంలో రోజా స్పందిండచం..దీనికి చింతమనేని కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Trending News