Ali Will Contest: సీఎం జగన్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎక్కడైనా పోటీకి 'సిద్ధం' అంటున్న నటుడు అలీ

Actor Ali Politics:  ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 19, 2024, 06:47 PM IST
Ali Will Contest: సీఎం జగన్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎక్కడైనా పోటీకి 'సిద్ధం' అంటున్న నటుడు అలీ

AP Elections: వందల సినిమాల్లో నటించిన నటుడు అలీ ప్రస్తుతం సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న అనంతరం తీవ్ర సందిగ్ధంలో ఉన్న ఆయన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. త్వరలోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. మొదటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నా అవకాశాలు లభించడం లేదు. గతంలో తన స్నేహితుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ నుంచి ఆశించారు. కానీ పవన్‌ అవకాశం ఇవ్వకోవడంతో వైసీపీలో చేరిన ఆయన ఇప్పుడు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్న అలీ తాజాగా సోమవారం ఈ విషయమై స్పందించారు.

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన

రాజమహేంద్రవరంలో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అలీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 'వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం నాకు కూడా తెలియదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ పిలిచి ఫలానా చోటు నుంచి పోటీ చేయ్‌ అంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో బహుశా కబురు రావొచ్చు. ఏ పార్టీలో ఉన్నా.. పోటీలో నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు' అని పేర్కొన్నారు.

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

పొత్తుల విషయమై అలీ స్పందిస్తూ.. 'ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా అంతిమ నిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ సిద్ధం అంటున్నాం. వాళ్లు సిద్ధం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో' అని అలీ పేర్కొన్నారు. కాగా అలీ పోటీ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కడప ఎంపీ స్థానంలో అలీని పరిశీలిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఎంపీ అభ్యర్థుల్లో మైనార్టీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న పార్టీ అధినేత ఆ కేటగిరీలో అలీ ఉన్నారు. కానీ మాత్రం శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అలీ భవిష్యత్‌ ఏమిటో వారంలో తేలే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ప్రయత్నించగా అవకాశం లభించలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News