Viral news : విశాఖ తీరంలో వింత జీవి.. భయబ్రాంతులకు గురైన ప్రజలు..!

Visakhapatnam: విశాఖపట్నంలోని సాగర తీరంలో వింత జీవి కళేబరం దర్శనమిచ్చింది. చూడటానికి పాము ఆకారంలో ఉంది. దీనిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 05:01 PM IST
Viral news : విశాఖ తీరంలో వింత జీవి.. భయబ్రాంతులకు గురైన ప్రజలు..!

Viral news in Telugu: విశాఖపట్నం సాగర్ నగర్ బీచ్(Sagar Nagar Beach) పరిసరాల్లో ఓ వింత జీవి కళేబరం కలకలం రేపింది. భారీ పాము ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సాగర్‌నగర్‌ బీచ్‌ సమీప గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంత తీరానికి మంగళవారం ఈ పాము కళేబరం కొట్టికొచ్చినట్లు తెలుస్తోంది. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు మత్స్యశాఖ అధికారులు. అనంతరం వీటిని 'నల్ల పాములు'గా గుర్తించారు. ఇవి సాగర జలాల్లో చాలా లోతులో జీవిస్తాయని తెలిపారు. వీటితో ప్రయోజనం లేని కారణంగా మత్స్యకారులు తమ వలకు ఇది చిక్కినా విడిచిపెడతారని పేర్కొన్నారు. అయితే వలకు చిక్కిన సందర్భంలో ఈ నల పాములు భయపడి ప్రాణాలు కోల్పోతాయని అధికారులు వెల్లడించారు. ఇంత భారీ ఆకారంలో ఉన్న పామును చూసి స్థానికులు, టూరిస్టులు షాక్ కు గురయ్యాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఏపీకి సముద్ర తీరం ఎక్కువగా ఉండటంతో తరుచూ రకరకాల జీవులు తీరాన్ని కొట్టుకువస్తాయి. ఇందులో కొన్ని మనకి తెలిసినవి ఉంటే... మరికొన్ని తెలియనివి ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి వింత వింత జీవులు ఎన్నో విశాఖ తీరానికి కొట్టుకొచ్చాయి. 

Also Read: Viral Video today: వాటర్‌ ఫాల్స్‌లో భారీ అనకొండ.. హడలిపోయిన టూరిస్టులు.. వీడియో వైరల్..

Also Read: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News