Kanakadurga flyover inauguration postponed: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కోసం విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే రేపు జరగాల్సి ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ( Vijayawada Kanakadurga flyover) మరోసారి వాయిదాపడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Srinivas) ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నప్పటికీ.. ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటినుంచి అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవానికి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకోని ఏర్పాట్లను సైతం చేసింది. ఈ క్రమంలో నిన్న (బుధవారం ) నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో దీని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని గురువారం తెలిపారు. అయితే ఈ వారధిపై వాహనాల రాకపోకలకు అనుమతించడంతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. Also read: Union minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా
గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది. pic.twitter.com/7Kb4Zpo8XO
— Kesineni Nani (@kesineni_nani) September 17, 2020
ఇదిలాఉంటే.. ముందుగా ఈ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ఈనెల 4నే ప్రారంభించాలని భావించారు. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత నేపథ్యంలో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రకటించడంతో.. అప్పుడు ఈ కార్యక్రమాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఫ్లై ఓవర్ ( Flyover ) సామర్ధ్యాన్ని పరీక్షించే చివరి పరీక్షల్ని సైతం హైవే అధికారులు మరోసారి పరీక్షలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. Also read : Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు