Polavaram Project: పోలవరం సవరించిన అంచనాకు ఆమోదం తెలిపిన కేంద్ర జలశక్తి శాఖ

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించే అంశంపై మార్గం సుగమం కానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 29, 2021, 09:00 AM IST
Polavaram Project: పోలవరం సవరించిన అంచనాకు ఆమోదం తెలిపిన కేంద్ర జలశక్తి శాఖ

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించే అంశంపై మార్గం సుగమం కానుంది.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్ని(Polavaram revised Estimation)ఆమోదించాలనే రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ ఎట్టకేలకు తీరనుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే విషయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో(Gajendrasingh Shekawat) వైసీపీ ఎంపీల సమావేశం విజయవంతమైంది. 2017-18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం 55 వేల 656 కోట్లు కాగా..సిడబ్ల్యూసీ పరిధిలోని రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలన అనంతరం 47 వేల 727 కోట్లకు ఆమోదించి..కేంద్ర జలశక్తి శాఖకు సిఫారసు చేసింది. దాంతో పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని 47 వేల 725 కోట్లకు ఆమోదిస్తామని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఎస్క్రో ఖాతా సాధ్యం కాదని...వారం లేదా 15 రోజుల్లో రీయింబర్స్ చేస్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకూ రీయింబర్స్ చేయాల్సిన 1907 కోట్లను చెల్లిస్తామని చెప్పినట్టు రాజ్యసభ (Rajyasabha) ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

మరోవైపు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని కోరగా..కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ (Polavaram project Authority)ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించేందుకు కేంద్రమంత్రి అంగీకరించారని విజయసాయిరెడ్డి (Vijayasaireddy)చెప్పారు. ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 51 వేల ఎకరాల్ని ప్రభుత్వ భూమిగా పరిగణించారని..కాని సర్వే, భూ రికార్డుల ప్రకారం అవి ప్రైవేటు, అసైన్డ్ భూములుగా తేలిందని చెప్పారు. 

Also read: Schools Reopen Decision: స్కూళ్లు, కళాశాలలు తెరిచే నిర్ణయం ఎవరిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News