Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, దక్షిణాది సీఎంలకు సమాచారం

Amit Shah Tirupati Tour Cancelled | కేంద్ర మంత్రి అమిత్ షా అనూహ్యంగా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 1, 2021, 01:42 PM IST
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు అయింది
  • మార్చి నెల 4, 5 తేదీలలో అమిత్ షా తిరుపతిలో పర్యటించాల్సి ఉంది
  • అయితే అనూహ్యంగా తన పర్యటనను షా రద్దు చేసుకున్నారని సమాచారం
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, దక్షిణాది సీఎంలకు సమాచారం

Amit Shah Tirupati Tour Cancelled | కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు అయింది. చిత్తూరు జిల్లా తిరుపతికి అమిత్ షా రావాల్సి ఉంది, కానీ అనూహ్యంగా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.

అమిత్ షా తిరుపతి పర్యటన దాదాపు నెల రోజుల కిందట షెడ్యూల్ చేశారు. మార్చి నెల 4, 5 తేదీలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం కావాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సైతం అందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మరో మూడు రోజుల్లో పర్యటన ఉండగా, కేంద్ర హోం మంత్రి పర్యటన రద్దు కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి

కాగా, ఇటీవల తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేందుకు బీజేపీ(BJP) కేంద్ర అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో అమిత్ షా పర్యటన రద్దయిందా, లేదా మరెమైనా కారణాలు ఉన్నాయా తెలియరాలేదు.

Also Read: Bank Holidays In March 2021: మార్చి నెలలో భారీగా బ్యాంకు సెలవులు, 2 రోజులు ఉద్యోగుల సమ్మె 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News