Train Cancelled: ఉత్తర భారతంలో మరో కొన్ని రోజులు పొగ మంచు కారణంగా జన జీనవానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. తెల్లవారుఝామున, ఉదయం విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు పొగమంచు కారణంగా ట్రాక్ లపై ప్రయాణిస్తూన్న రైళ్ల డ్రైవర్లకు సిగ్నల్స్ సరిగా కనిపించకపోవడంతో రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ క్రమంలో పొగ మంచు కారణంగా ప్రయాణికులకు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి వరకు ఉత్తర భారతదేశంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసింది. ప్రమాదాలను నివారించడానికి, పొగమంచు సమయంలో ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.
రాబోయే వారాల్లో ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు కలిగిన అసౌకర్యాన్ని ముందుగానే తెలుసుకునేందుకు రద్దు చేయబడిన రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో అత్యవసర పనులపై వెళ్లేవాళ్లకు ఇది శరాఘాతం అని చెప్పాలి. కానీ భద్రతా పరమైన చర్యల్లో భాగంగా ఎలాంటి యాక్సిడెంట్స్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎపుడో ప్లాన్ ప్రకారం షెడ్యూల్ చేసుకున్న టూర్స్ రైల్ల రద్దు కారణంగా ప్రయాణికులకపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.