Tornados in cyclone: రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం రేపిన సుడిగాలి

Tornados in cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. బాపట్ల వద్ద మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా టోర్నడో విధ్వంసం రేపింది. పలు ప్రాంతాల్లో సుడిగాలి తీవ్రంగా భయపెట్టింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 6, 2023, 07:28 AM IST
Tornados in cyclone: రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం రేపిన సుడిగాలి

Tornados in cyclone: మిచౌంగ్ తుపానులో ఈసారి  కొత్త పరిణామం చోటుచేసుకుంది. తీరప్రాంతాల్లో వీచే పెనుగాలులకు తోడుగా ఇతర ప్రాంతాల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి వేగంగా తిరుగుతూ అడ్డొచ్చినవాటిని గాలిలో ఎగరేసుకుంటూ పోయింది. సుడిగాలి రేపిన విధ్వంసం అంతా ఇంతా కాదు..

మిచౌంగ్ తుపాను తీరం దాటినప్పటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాత్రంతా ఎడతెరిపలేకుండా భారీ వర్షాలు కురిసాయి. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు తీరం దాటే సమయానికి తీరంలో గంటకు 110 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు ప్రళయాన్ని తలపించాయి. ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు పెనుగాలులతో కోస్తాతీరం వణికిపోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కొత్తగా సుడిగాలి విధ్వసం రేపేసింది. భీమవరం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అన్నవరం ప్రాంతాల్లో సుడిగాలి తిరుగుతూ అడ్డొచ్చిన వాటిని గాలిలో ఎగురేసుకుంటూ వెళ్లిపోయింది. సుడిగాలి బీభత్సం రాజమండ్రిలో స్పష్టంగా కన్పించింది.

సుడిగాలి ప్రభావానికి గోదావరి నదిలో నీళ్లు సముద్రంలా ఎగసిపడ్డాయి. వై జంక్షన్, దానవాయిపేట, ప్రకాశం నగర్, మోరంపూడి, హుకుంపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాలు, వీఎల్ పురం, ఏవీఏ రోడ్ ప్రాంతాల్లో దుకాణాలపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. చిన్న చిన్న కార్లు ఎగిరి పడ్డాయి. 

Also read: Michaung Cyclone Landfall: బాపట్ల వద్ద తీరం దాటిన మిచౌంగ్, 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News