Tirupati Railway Station: తిరుమల తిరుపతి దేవస్థానం కొలువుదీరిన తిరుపతి రైల్వే స్టేషన్ ఇప్పుడిక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ కానుంది. రైల్వే మంత్రి వైష్ణవ్ పలు డిజైన్లు కూడా విడుదల చేశారు.
హిందూవుల కలియుగదైవంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన తిరుమల-తిరుపతి నగరం హిందూవులకు అత్యంత పవిత్రం. తిరుమల దర్శనం కోసం విభిన్న ప్రాంతాల్నించి వచ్చే అశేష భక్తజనంలో మెజార్టీ రైల్వే మార్గం ద్వారానే వస్తుంటారు. రోజూ వేలాదిమంది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. స్టేషన్ మాత్రం గత 25 ఏళ్లుగా అలాగే ఉంది.
దేశవిదేశాల్నించి పెద్దఎత్తున భక్తులు ప్రయాణాలు చేస్తుండటంతో..తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వివిధ పనుల్ని వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీనికి సంబంధించి రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ డిజైన్ ఫోటోల్ని ట్విట్టర్‌లో విడుదల చేశారు. అద్భుతమైన రాజమహల్ తలపిస్తూ..ఠీవిగా కన్పిస్తోంది.
దేశంలో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
Also read: Divyavani Resign: తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రిజైన్.. మహానాడులో అవమానించారట? వైసీపీలో చేరబోతోందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook