/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Pawan Kalyan Tirumala Declaration: తిరుమల లడ్డూపై సృష్టించిన వివాదంతో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగమేఘాల మీద ప్రాయశ్చిత దీక్ష చేపట్టి కలకలం రేపారు. సుప్రీంకోర్టు సూచనలో తిరుమల లడ్డూ వివాదం అంతా కుట్ర అని తేలడంతో పవన్‌ చేపట్టిన దీక్ష ఉద్దేశం నీరుగారింది. అయితే ఈ దీక్ష విరమణ సందర్భంగా పవన్‌ తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. తిరుమల పర్యటనలో ఆయన చేసిన ఒక్క పని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది.

Also Read: Dusshera: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు దసరా కానుక.. పోలీస్‌ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

దీక్ష విరమణ కోసం తిరుమల సందర్శించడానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ చేసిన ఒక్క పనితో జగన్‌కు భారీ దెబ్బ తగిలింది. తిరుమల పర్యటనలో డిక్లరేషన్‌పై తన కుమార్తెతో పవన్‌ కల్యాణ్‌ సంతకం చేయించి సంచలనం రేపారు. తిరుమల డిక్లరేషన్‌ ఇవ్వాలని సర్వత్రా డిమాండ్‌ వ్యక్తమైన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అర్ధాంతరంగా తిరుమల పర్యటనను విరమించుకున్నారు. దాన్ని గుర్తించిన పవన్‌ కల్యాణ్‌ తిరుమల పర్యటనలో తన కుమార్తెతో డిక్లరేషన్‌ ఇచ్చారు.

Also Read: Tirumala Laddu Row: సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ, చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్‌ షర్మిల

డిక్లరేషన్‌ అనే అంశం చూడడానికి చిన్నగా కనిపించినా దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. డిక్లరేషన్‌ ఇవ్వడంతో పవన్‌ కల్యాణ్‌ ప్రజల్లోకి రెండు సంకేతాలు పంపారు. క్రైస్తవరాలైన తన కుమార్తెతో డిక్లరేషన్‌ ఇప్పించడంతో అటు క్రైస్తవుల దృష్టిని ఆకర్షిస్తూనే ఇటు హిందూవుల దృష్టిలో పడ్డారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి సంప్రదాయాలు పాటిస్తామనే భావనను డిక్లరేషన్‌తో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తమకు హిందూత్వంపై ఉన్న నమ్మకాన్ని డిక్లరేషన్‌తో జగన్‌ చెప్పారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌పై సంతకం చేయని జగన్‌కు విషయం చర్చలోకి వచ్చేట్టు పవన్‌ చేశారు. ఒక్క పనితో పవన్‌ కల్యాణ్‌ హిందూ, క్రైస్తవ వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు.

జగన్‌ వర్గం సైలెంట్‌
తిరుమల లడ్డూ వివాదంలో జగన్‌ హిందూత్వంపై నమ్మకం లేదనే వాదన బలంగా వినిపించింది. తిరుమలను సందర్శించడానికి సిద్ధమైన వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ తప్పనిసరిగా ఇచ్చి వెళ్లాలనే డిమాండ్‌ తీవ్రమవడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తిరుమల పర్యటనను రద్దు చేసుకుని డిక్లరేషన్‌ అంశాన్ని తప్పించుకున్నారు. అదే విషయాన్ని తన కుమార్తెల డిక్లరేషన్‌తో పవన్‌ గుర్తుచేశారు. డిక్లరేషన్‌తో పవన్‌ రెండు వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Tirupati Laddu Row Pawan Kalyan Strong Counter To Ex CM YS Jagan With Tirumala Declaration Of Daughter Rv
News Source: 
Home Title: 

Tirumala Declaration: వైఎస్ జగన్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Tirumala Declaration: వైఎస్ జగన్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
Caption: 
Pawan Kalyan vs YS Jagan Mohan Reedy (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Tirumala Declaration: వైఎస్ జగన్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 2, 2024 - 18:19
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
42
Is Breaking News: 
No
Word Count: 
282