Chandragrahanam Effect: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala Temple Closed on 8th November: తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూసివేయనున్నారు. నవంబర్ 8న చంద్రగ్రహణం నేపథ్యంలో సర్వదర్శనాలు నిలిపివేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 02:45 PM IST
  • న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం
  • దాదాపు 12 గంటలపాటు శ్రీ‌వారి ఆల‌య మూసివేత
  • ఎస్ఎస్‌డీ టోకెన్లు ర‌ద్దు
Chandragrahanam Effect: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala Temple Closed on 8th November: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీ‌ వెంకటేశ్వర స్వామి ఆల‌యంలో ఈ నెల 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు చేసినట్లు వెల్లడించారు. గ్రహణం కారణంగా నవంబరు 8న తిరుప‌తిలో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లు  కూడా రద్దు చేసినట్లు చెప్పారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం -2 నుంచి మాత్రమే భ‌క్తుల‌కు అనుమతి ఉంటుందన్నారు.

ఈ నెల 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుంచి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుంచి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. భ‌క్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇబ్బంది పడకుండా.. తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఎఫెక్ట్‌తో దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలసిందే. ఉదయం 8.11 గంటలకు ఆలయాన్ని మూసి వేసి.. అదే రోజు రాత్రి 7.30 గంటలకు తెరిచారు. దాదాపు 18 గంటలపాటు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. తాజాగా ఈ నెల 8న చంద్రగ్రహణం నేపథ్యంలో మరోసారి శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. భక్తులు ముందుగా గమనించి.. తిరుమల ట్రిప్‌కు వెళ్లడం బెటర్.

శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఈవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. భక్తులు సందేహాలు, సూచనలు 0877–2263261 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చని సూచించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమాధానం ఇస్తారని చెప్పారు.

Also Read: TRS mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడే హైకోర్టులో విచారణ.. అందరిలోనూ ఉత్కంఠ  

Also Read: Koppula Eshwer: ప్రగతి భవన్ లో దళిత మంత్రికి ఘోర అవమానం.. తన పక్కన కూర్చోనివ్వని కేసీఆర్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News