Tirumala Salakatla Brahmotsavams AP CM YS Jagan Mohan Reddy in Tirumala Darshan: సాలకట్ల బ్రహ్మోత్సవాల (Salakatla Brahmotsavams) పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన అన్నమయ్య భవన్‌కు (Annamayya Bhavan) చేరుకున్నారు. రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. శ్రీవారి ధ్వజ స్తంభాన్ని (dwajasthambam) నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు సీఎం జగన్. అనంతరం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
శ్రీవారి దర్శనం తర్వాత సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు (sri venkateswara bhakti channel) సంబంధించిన కన్నడ, హిందీ ఛానెల్స్ ను జగన్ ప్రారంభించారు. అలాగే తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇక సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు సీఎం జగన్‌కు అందజేశారు.
Also Read : Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు
అనంతరం టీటీడీ (TTD) 2022 డైరీలు, క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు. ఇక అంతకుముందు బర్డ్ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఏపీ ప్రభుత్వం (ap government) ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలను అందించనుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. అలాగే అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు.
Also Read : KKR vs RCB match highlights: బెంగళూరును ఓడించిన కోల్‌కతా.. కోహ్లీ సేన నడ్డి విరిచిన Sunil Narine