టెట్ పరీక్షల కొత్త షెడ్యూలు విడుదల..!

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ విడుదలయింది.

Last Updated : Jan 28, 2018, 10:02 AM IST
టెట్ పరీక్షల కొత్త షెడ్యూలు విడుదల..!

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ విడుదలయింది. ఇప్పటికే రెండు సార్లు ఈ షెడ్యూల్‌ మారిన విషయం తెలిసిందే. ఆఖరి నిమిషంలో భాషా పండితుల విషయంలో పేపర్ 3 పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అభ్యర్థుల కోరికపై మరో 16 రోజుల పాటు విద్యాశాఖ ఈ పరీక్షలను వాయిదా వేసింది. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించాల్సిన ఈ పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థుల నుండి ఎక్కువగా అభ్యర్థనలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  టెట్ పరీక్షకు మొత్తం 4,46,833 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్‌-1కు 1,80,249 మంది, పేపర్‌-2 కు 2,12,794 మంది, పేపర్‌-3 కు 53,290 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్లు), పేపరు 2 (స్కూల్ అసిస్టెంట్లు), పేపర్ 2 (భాషా పండితులు) కోసం నిర్దేశించారు. 

Trending News