AP Summer Temperatures: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 41.6, చిత్తూరులో 41.4, జమ్మలమడుగులో 41.4, తిరుపతిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక విజయవాడలో 39.2, విశాఖపట్నంలో 33.9, ఒంగోలులో 36.8, గుంటూరులో 37.4, నెల్లూరులో 39.7, విజయనగరంలో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమితో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలకు భయపడి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరూ కాలు బయటపెట్టట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేవారు సైతం ఉదయం 10-11గంటల వరకే పనులు చక్కబెట్టుకుని ఇళ్లకు చేరుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండ పూట ఎవరూ బయటకు వెళ్లట్లేదు.
Also Read: Rashmika Gym Workout: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న రష్మిక.. ఏందీ ఆ వర్కౌట్లు! వీడియో చూస్తే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook