AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరోసారి రచ్చరచ్చయ్యాయి. ఎమ్మెల్యే బాలకృష్ణకు అసెంబ్లీ సినిమా సెట్టింగ్ అన్పించినట్టుంది. అసెంబ్లీ గౌరవ మర్యాదలు మర్చి..సీటెక్కి విజిల్స్ వేయడం మొదలెట్టారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన కొనసాగించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీగా నినాదాలు చేస్తూ టీటీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. తొలిరోజు సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాటిక్ శైలిలో తొడగొట్టి మీసం మెలేయడంతో అసెంబ్లీలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాలయ్య చర్యలపై ఏపీ స్పీకర్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ రెండవ రోజు సమావేశాల్లో కూడా అతని వైఖరి మారలేదు.
అసెంబ్లీలో చంద్రబాబు సీటెక్కి..విజిల్స్ వేస్తూ అసెంబ్లీ గౌరవ మర్యాదలకు భంగం కల్గించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై జగన్ కు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అంతేకాకుండా తమ ఆందోళనను ప్రచారం కోసం వీడియా తీయసాగారు. ఈ విషయాన్ని ఛీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత టీడీపీ సభ్యులు ఎర్నన్నాయుడు, బి అశోక్‌లను స్పీకర్ మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేశారు.
అదే సమయంలో బాలకృష్ణ సహా టీడీపీ సభ్యులు విజల్ వేస్తూ నిరనసకు దిగారు. ఎమ్మెల్యే బాలయ్య అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి విజిల్ ఊదుతూ హంగామా సృష్టించారు. టీడీపీ సభ్యులపై చర్యలపై మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు మండిపడ్డారు. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో మరోసారి సభ వాయిదా పడింది.
Also read: Chandrababu Case: సీఐడీ కస్టడీనా, రిమాండ్ పొడిగింపా..ఇవాళ ఏం జరగనుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook