Chandrababu Naidu : ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా: చంద్రబాబు

Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 11:16 AM IST
  • చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం
  • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి నిరసనగా దీక్ష
  • దాడులు విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదన్న చంద్రబాబు
Chandrababu Naidu : ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా: చంద్రబాబు

Telugu Desam Party President Nara Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 36 గంటల నిరసన దీక్ష గురువారం ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే చంద్రబాబు దీక్ష కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని (democracy) కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP head office) ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని అన్నారు. అలాంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. అది 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమని చెప్పారు. పట్టాభి (Pattabhi) ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతో పాటు చాలా చోట్ల దాడులు జరిగాయని మండిపడ్డారు. 

Also Read : AP CM YS Jagan : అధికారం దక్కలేదనే అక్కసుతోనే కుట్రలు, సీఎంపైనా అసభ్య పదజాలమా? - సీఎం వైఎస్ జగన్‌

ఇక దాడులు విషయంపై డీజీపీకి (DGP) ఫోన్‌ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. పోలీసులు స్పందించకుంటే తనకేమైనా పరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయని విమర్శించారు.

దాడి చేసిన వారిని పోలీసులు (Police) దగ్గరుండి సాగనంపడం సిగ్గుచేటని చంద్రబాబు తప్పుబట్టారు. తమ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెడతారా ప్రశ్నించారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Also Read : Police Commemoration Day 2021: ఏపీ పోలీసులకు గుడ్‌ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News