/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Andhra Pradesh Polling: పోలింగ్‌ వేళ ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ జరిగింది. చాలా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గొడవకు దిగడంతో పలుచోట్ల తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరికొన్ని చోట్ల టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఓటింగ్‌ వేళ అక్రమాలకు పాల్పడుతుండడంతో వాటిని అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. పరస్పరం దాడులకు పాల్పడడంతో అక్కడక్కడ హింసాత్మకంగా మారింది. వెంటనే భద్రతా బలగాలు స్పందించి చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలింగ్‌ ముగిసే సమయానికి చాలా చోట్ల ఘర్షణలు తలెత్తాయి.

Also Read: YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!

ఘర్షణలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడిన వారిపై.. పలుచోట్ల పోలింగ్‌కు ఆటంకం ఏర్పడడంపై ఈసీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ యంత్రాంగానికి ఆదేశించింది. ఇప్పటికే ఇరు పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి. పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగేందుకు వెంటనే కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఈసీ ఆదేశించింది. కాగా ఏపీ వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘర్షణలు ఇలా ఉన్నాయి.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

 

తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం
చిల్లకూరు మండలకేంద్రంలోని 114వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ  నియోజకవర్గ అభ్యర్థి మేరిగ మురళీధర్‌కు, టీడీపీ నాయకుడికి మధ్య తీవ్రవివాదం. వివాదం ముదరడంతో ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకున్నారు. ఘర్షణకు దిగినవారిని పోలీసు బలగాలు చెదరగొట్టాయి.

ఎన్డీఏ కూటమి నేతలపై వైయస్ఆర్ కాంగ్రెస్ నేతల దౌర్జన్యం. సీకాం కాలేజీలోని 250 బూత్ వద్ధ ఆరణి జగన్‌పై కార్పొరేటర్ శేఖర్ రెడ్డి దౌర్జన్యం చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం రావడంతో బూత్ వద్దకు వెళ్లిన జగన్‌ను శేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని అక్కడకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చేరుకుంది. ఆమె అనుచరుడు రామకృష్ణను శేఖర్ రెడ్డి తోసేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని పెద్ద హైస్కూల్‌లోని 251 పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేసిన అధికార పార్టీ నాయకులు.
మాచర్లలోని జెడ్పీ బాలుర పాఠశాల వెనుక ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవ.
దొడ్లేరులో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. అదనపు బలగాలను రప్పించాలని ఓటర్ల డిమాండ్‌.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం
దగదర్తి గ్రామంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు

మైదుకూరులో లాఠీచార్జి
మైదుకూరు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న అల్లరి మూకలపై కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ లాఠీ ఝుళిపించారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట
పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో రాళ్ల దాడి జరిగింది. సర్పంచ్ లక్ష్మణ్ రావు ఇంటిపై రాళ్ల దాడి చేసిన ప్రత్యర్థులు. రాళ్ల దాడిలో ఇద్దరికి గాయాలు కాగా మూడు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

అనకాపల్లి జిల్లా
పాయకరావుపేట నియోజకవర్గం కొత్త రేవుపోలవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు.

చీరాల నియోజకవర్గం
బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య పర్యటించారు. గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

దాచేపల్లి మండలం ఇరికేపల్లి నడికుడి గ్రామాల మధ్య ఘర్షణ. నడికుడి గ్రామానికి చెందిన టిడిపి శ్రేణులు అలజడులు సృష్టించడానికే ఇరికేపల్లి గ్రామంలోకి  ప్రవేశించి ఘర్షణ చేశారని ఇరికేపల్లి గ్రామస్తుల ఆరోపించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం

ఆత్మకూరు పట్టణం సంతమార్కెట్ లోని 72వ  పోలింగ్ కేంద్రంలో  ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి  పీఏనంటూ ఓ వ్యక్తి పోలింగ్ బూతులోకి  వెళ్లడంతో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వైసీపీ, టీడీపీ నేతల బాహాబాహి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Telugu Desam Party Leaders Goons Attack On YSRCP Cadre In Various Polling Booths Rv
News Source: 
Home Title: 

AP Elections High Tension: పోలింగ్‌ రోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత

AP Elections High Tension: పోలింగ్‌ వేళ ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత
Caption: 
AP Election Polling High Tension (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
High Tension: పోలింగ్‌ వేళ ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Monday, May 13, 2024 - 17:43
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
47
Is Breaking News: 
No
Word Count: 
442