Idem Karma: ఇదేం కర్మపై వ్యతిరేకత, తెలుగు తమ్ముళ్లకు నచ్చని రాబిన్ శర్మ

Idem Karma: ఇదేం కర్మ కాదు..ఆ పార్టీ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్తే మా కర్మ అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఎన్నికల వ్యూహకర్తపై టీడీపీ సీనియర్ నేతల్లో విముఖత వ్యక్తమౌతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2022, 07:54 PM IST
Idem Karma: ఇదేం కర్మపై వ్యతిరేకత, తెలుగు తమ్ముళ్లకు నచ్చని రాబిన్ శర్మ

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇటీవల ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ నియామకాన్ని అధికారికం చేసింది. పార్టీకి కొత్త దిశానిర్దేశం చేస్తూ సూచించిన ఇదేం కర్మ కార్యక్రమం ఇప్పుడు ఆ పార్టీలో వ్యతిరేకతకు కారణమౌతోంది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ వైఖరికి నిరసనగా..ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించబోతోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఈ కార్యక్రమాన్ని సూచించారు. ఇప్పుడు ఈ కార్యక్రమమే ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త సూచించిన ఈ పేరు పార్టీలో సీనియర్ నేతలకు నచ్చడం లేదు. టీడీపీ సీనియర్ నేతలకు ఇదేమి కర్మ అనే పేరు నచ్చలేదని తెలుస్తోంది. కొంతమంది తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేసినా..టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు రాబిన్ శర్మ సూచించిన ఇదేమి కర్మ పేరుపై వ్యతిరేకత రావడం ఆ పార్టీ అధినేత ఊహించని పరిణామం.

తెలుగుదేశం పార్టీ గతంలో ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ గతంలో చాలా మంచి మంచి పేర్లతో వెళ్లింది. మీ కోసం, మళ్లీ వస్తున్నా అనే పేర్లు పార్టీకు మంచి పేరు తెచ్చిపెట్టాయని టీడీపీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో..డిసెంబర్ 1 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమానికి ఇదేమి కర్మ పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తమౌతోంది. సీనియర్ నేతలు బాహాటంగానే ఈ పేరును విమర్శిస్తున్నారు. 

విఫలమైన బాదుడే బాదుడు 

రాబిన్ శర్మ సూచించిన మరో కార్యక్రమం బాదుడే బాదుడు కూడా టీడీపీ సీనియర్ నేతలకు నచ్చలేదు. రాబిన్ శర్మ సూచించిన ఆ కార్యక్రమం అందుకే విఫలమైందని టీడీపీ నేతల అభిప్రాయంగా ఉంది. రాబిన్ శర్మ సూచించిన పేర్లు దిగువ స్థాయి వరకూ వెళ్లడం లేదనేది టీడీపీ నేతల వాదన. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా సూచించిన ఇదేమి కర్మ పేరుపై పార్టీలో ఒకరిద్దరు తప్పించి మిగిలినవారంతా చంద్రబాబు సమక్షంలోనే వ్యతిరేకించారు.

ఇదేమి కర్మ పేరుపై అభ్యంతరాలు

ఈ పేరు ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న పేరని..రాజకీయాల్లో సరిపడదని పార్టీ సీనియర్ నేతల వాదన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ పేరును తమను అవహేళన చేసి దుమ్మెత్తిపోసేందుకు వాడుకుంటారనేది టీడీపీ నేతల ఆందోళనగా ఉంది. ఇప్పుడు రాబిన్ శర్మ సూచించిన ఇదేమి కర్మ పేరుకు ప్రత్యామ్నాయంగా టీడీపీ నేతలు కొన్ని పేర్లు సూచించినా..చంద్రబాబుకు నచ్చలేదట. చంద్రబాబుకు మాత్రం ఇదే నచ్చింది.

ఇదేం కర్మ కాదు..రాబిన్ శర్మ మా పార్టీకి కర్మ

మొత్తానికి పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మే పార్టీలో చాలామంది నేతలకు నచ్చలేదని సమాచారం. రాబిన్ శర్మ మా పార్టీకి కర్మ అని..పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోందని సమాచారం. అసలు రాబిన్ శర్మ పార్టీకు ఏ మేరకు ఉపయోగపడతాడనేది కూడా అర్ధం కావడం లేదని టీడీపీ నేతలే అంగీకరించిన పరిస్థితి ఉంది. అసలు రాబిన్ శర్మ పార్టీని ఎటువైపుకు తీసుకెళ్తున్నారనేది అర్ధం కావడం లేదని..లోకల్ సెంటిమెంట్లు, స్థానిక సమస్యల్ని ఆయనకు అర్ధం కావడం లేదనేది టీడీపీ నేత అభిప్రాయం.

Also read: Lawyers Protest: న్యాయమూర్తుల బదిలీపై నిరసన, రోడ్డెక్కిన న్యాయవాదులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News