Ayyannapatrudu: 14 కేసులు పెట్టారు..ఏం చేశారు..సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు ఫైర్..!

Ayyannapatrudu: ఏపీలో రాజకీయాలు హీట్‌పై ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.  

Written by - Alla Swamy | Last Updated : Oct 1, 2022, 06:44 PM IST
  • ఏపీలో రాజకీయాలు
  • అయ్యన్న కుమారుడు ఇంటికి సీఐడీ
  • ఖండించిన అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu: 14 కేసులు పెట్టారు..ఏం చేశారు..సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు ఫైర్..!

Ayyannapatrudu: ఏపీలో సీఐడీ అధికారుల దౌర్జన్యం పెరిగిపోయిందన్నారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. తన కుమారుడు విజయ్ ఇంటికి మఫ్టీలో వెళ్లి సీఐడీ అధికారులు దుర్భాషలాడారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి రావడం ఏంటన్నారు. తన ఇంటి ఆవరణలో ఉన్న సిబ్బందిపై దాడి చేశారని ఆరోపించారు. లాయర్ వచ్చి చెప్పినా వినలేదని ఫైర్ అయ్యారు. 

వైసీపీ పాలన గురించి తాము మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నామని..లోపాలను ఎత్తి చూపుతామన్నారు. తాము ఎలాంటి అవినీతి పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సీఎం జగనే ఎన్నో అవినీతి పనులు చేశారన్నారు. అందుకే జైలుకెళ్లి వచ్చారని విమర్శించారు. కుంభకోణాల్లో ఇరుక్కున్నారని..చివరకు భార్యను సైతం ఇరికించారని ఆరోపించారు అయ్యన్నపాత్రుడు.

టీడీపీ నేతలపై టార్గెట్ చేశారని..అందుకే వేధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీఐడీ డిపార్ట్‌మెంట్ పనికిమాలినదిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నాళ్లు దౌర్జన్యాలు చేస్తారని విమర్శించారు. తనపై 14 కేసులు పెట్టారని..ఏం చేశారని మండిపడ్డారు. తమకు న్యాయస్థానాలు ఉన్నాయని..లేకుంటే తమ పరిస్థితి ఏంటన్నారు. సీఎం జగన్‌కు ఆలోచనా విధానం లేదన్నారు. 

ఆయనో మూర్ఖుడని విమర్శించారు. జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడం, తప్పించుకోవడం తెలుసని అన్నారు. ఆడవాళ్లని సీఐడీ అధికారులు తిడుతున్నారని..మీ ఇంట్లో వాళ్లని తిడితే మీకు ఎలా ఉంటుందని అయ్యన్నపాత్రుడు సూటిగా ప్రశ్నించారు. రిషికొండపై సీఎం ఇళ్లు కడితే మీకేంటని మాట్లాడుతున్నారని..ప్రతపక్షంలో ఉన్నాం..నిలదీయలేమా అని అన్నారు అయ్యన్నపాత్రుడు.

తన భార్య, పిల్లల కోసం రిషికొండపై సీఎం జగన్ ..ఇళ్లు నిర్మించుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనపై ప్రజల్లో పోరాటం చేస్తామన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రుషికొండ మొత్తాన్ని మంత్రులంతా ఆక్రమించుకుంటారా అని ఫైర్ అయ్యారు. మొత్తంగా ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార, విపక్షాలన్నీ నువ్వానేనా అన్నట్లు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. 

రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార పార్టీ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా..తమదే విజయమంటున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.

Also read:IND vs SA: టీమిండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికాడు..అర్ష్‌దీప్‌పై పాక్ మాజీ ప్లేయర్ ప్రశంసలు..!  

Also read:Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల మధ్యే పోటీ..సోనియా మద్దతు ఎవరికీ..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News