Chandrababu Naidu On CM Jagan: తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం పార్టీ అమలుచేసిన పథకాలు.. చేపట్టిన కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశమేనని గుర్తుచేశారు చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్లకు రూపాయి ఖర్చుపెట్టలేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూపాయి కేటాయించలేదన్నా. అమ్మఒడి నాన్నబుడ్డిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దళితులకోసం ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం అమలు చేసింది లేదన్నారు.
'దళితులకు పథకాలు, సంక్షేమమే కాకుండా ఎస్సీలను వ్యక్తిగతంగా ప్రోత్సహించాము . బాలయోగిని తొలిసారి లోక్ సభ స్పీకర్‌ను చేశాం. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. అంబేద్కర్ విదేశీ విద్య పథకం అమలు చేసి 440 మంది దళిత యువతీ యువకులను విదేశాలకు పంపించాము. నేను అంబేద్కర్ పేరుపెడితే.. అది తీసేసి జగనన్న అని పెట్టా రు. నాలుగేళ్లలో కేవలం 10 మందికి డబ్బులిచ్చి పేరు మార్చాడు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్మృతివనం ఏర్పాటుకు బీజం వేస్తే దాన్నిఆపేశారు. అంబేద్కర్ విగ్రహంతోపాటు, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాం పెట్టాలనుకున్నాం..
నిన్న ఒక అమ్మాయిని చూశాను. చదువుకోవాల్సిన వయసులో పేదరికం వల్ల కూలీ పనులకు వెళ్తోంది. ఆ అమ్మాయి నేను మాట్లాడుతుంటే ఫోన్లో తమవారికి లైవ్ చూపిస్తోంది. ఆ అమ్మాయిని చదువుకుంటావా అని అడిగితే చదువుకుంటాను అన్నది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ అమ్మాయిని చదివించే బాధ్యత తీసుకున్నాను. ఇలాంటివి ప్రభుత్వం చేయాలి. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. అమరావతి పూర్తై ఉంటే ఎవరూ ఎక్కడికి పోకుండా.. అందరికీ ఉపాధి ఉద్యోగాలు లభించేవి. నేను చెబుతున్న ఫార్ములా P-4 పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. P-4 పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్. పేదలను ధనికుల్నిచేయడమే టీడీపీ నిర్దిష్ట విధానం. మనం పైకిరావడం కాదు.. అందరినీ పైకి తీసుకురావాలన్నదే నా ధ్యేయం..' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ సందర్భంగా ‘దళితద్రోహి జగన్ రెడ్డి: దళితబాంధవుడు-పేదలపెన్నిధి చంద్రన్న’ అనే పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆ పుస్తకంలో అంశాలను చదివి వినిపించారు. దళితుల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 పథకాలు రద్దు చేశాడని.. దళితులకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను కాజేశాడని ఆరోపించారు. కోడికత్తి డ్రామాలాడి దళిత యువకుడు శ్రీనివాస్‌ను అన్యాయంగా జైలుపాలు చేశాడని ఆరోపించారు . జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని.. ఆయనకు ఎక్కువ సీట్లు రావాలని శ్రీనివాస్ ఆ పనిచేస్తే దాన్ని తన మీదకు నెట్టి సానుభూతి పొందాడని అన్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి.. శవాన్ని డోర్ డెలివరీ చేశాడని ఫైర్ అయ్యారు. అనంతబాబు జైలుకెళ్లి తిరిగొస్తుంటే.. అతనికి ఊరేగింపుగా స్వాగతాలు పలుకుతారా..? ఎంత అహంకారం..? అని మండిపడ్డారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. 'నవరత్నాలతో సంక్షేమం చేస్తున్నాడంటా..? 10 రూపాయలిచ్చి 100 రూపాయలు దోచేయడం సంక్షేమమా..? ఒక వ్యక్తి బాబాయ్‌ని చంపి.. ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టి ట్విస్టులమీద ట్విస్టులు పెడుతూ.. ప్రపంచంలో ఏ సినిమాలో లేని విధంగా మలుపులు తిప్పాడు. మొన్న యర్ర గొండపాలెంలో దళితులను బలిచేసి.. మనపై కుట్రచేయాలని ప్లాన్ చేశాడు. ఎంత కరుడుగట్టిన నేరస్తుడు ఇతను. రేపు తనింట్లో ఏదో ఒకటి చేసి.. అది కూడా మనమే చేశామని చెప్పేంతటి ఘనుడు. బాబాయ్‌ను చంపేశాడు. కన్నతల్లిని, చెల్లిని రోడ్లపాలు చేశాడు. యుగానికి ఒక యుగపురుషుడు పుట్టినట్టే.. యుగానికి ఒక రాక్షసుడు పుడతాడు అనడానికి ఇతనే రుజువు. రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే ఈ దుర్మార్గుడు పుట్టాడేమో అని నాకు అనిపిస్తోంది..' అని ఆయన అన్నారు.
Also Read: Dantewada Attack: దంతెవాడ ఘటనపై మవోయిస్టులు లేఖ విడుదల.. పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Chandrababu Naidu: యుగానికి ఒక రాక్షసుడు జగన్.. అందుకే ఈ దుర్మార్గుడు పుట్టాడేమో.. చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు